Gandhi Sarovar Project : భాగ్యనగర అభివృద్ధి చరిత్రలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారనుంది. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా బాపుఘాట్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు దాదాపు ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక, పర్యావరణ, పర్యా టక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తలపోసింది. తాజా గా అందుకు అవసరమైన 83 ఎకరాలకుపైగా భూమిని బదలీ చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతించడాన్ని స్వాగతిద్దాం. హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు కలి గేలా మూసీనదిని కాలుష్యరహితంగా మార్చి కొత్త పర్యా టక కేంద్రాలను సృష్టించేందుకు ఈ సరోవర్ ప్రాజెక్టు దోహదపడుతుందన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రణాళికల ప్రకారం గాంధీ సరోవర్లో మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, హ్యాండ్లూమ్ శిక్షణ కేంద్రం, ధ్యానసిద్ధి గ్రామం, పర్యాటక విశేష ప్రాజెక్టుగా రూపొందుతుంది. జంటనగరాల ప్రజలకే కాకుండా దేశవ్యాప్త పర్యాటకులకు ఈ ప్రాజెక్టు ద్వారా గాంధీజీ స్ఫూర్తిని మదిలో నింపే ప్రయత్నం మంచి ఆలోచనే. ఈ ప్రాజెక్టును గొప్ప సాంస్కృతిక చిహ్నంగా, వివాదారహితంగా రూపు దిద్దుకోవాలంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాల సమాహారంగా కాకుండా హైదరాబాద్ ప్రజల మానస పుత్రికగా మార్చాలి.
Read Also :PMMY : ముద్రా యోజన పథకం విషయంలో ఆ ప్రచారం నమ్మకండి !!

Gandhi Sarovar Project : నివాస ప్రాంతాలపై ప్రభావం
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, అనే మూడు అంశాల ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ ఆశయాల నేపథ్యంలో సమతుల్యత సాధించాలి. గాంధీ సరోవర్ ప్రాజెక్టును సక్రమంగా నిర్మించి, సజావుగా పూర్తి చేయాలనే చిత్తశుద్ధి పక్కాగా ఉండాలి. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో ఉండే కొన్ని నివాస (ప్రాంతాలపై ప్రభావం పడుతుంది. వాటి విషయంలో ప్రభుత్వ మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరముంది. నిర్వాసితుల సమస్య ఏర్పడినప్పుడే రాజకీయ అవరో ధాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి సందర్భంలో స్థానికులు, పౌరసంఘాలు ఆందోళనలు వెల్లువెత్తుతుంటాయి. వీటన్నిటినీ ఎదురొడ్డి పరిష్కారాలు చూపితేనే ప్రజల్లో ప్రభుత్వ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యా లను పరిపూర్ణం చేయవచ్చు. ప్రధానంగా రేపొచ్చే ప్రయోజనాల విషయమై రాజీపడరాదు. పర్యావరణ పరిరక్షణ పేరిట ప్రజల జీవనోపాధిపై ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలి. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన భూముల బదలాయింపునకు అను మతితోపాటు వర్క్ పర్మిషన్ ఇస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతరం మూసీ నదిలో మంచినీరే ప్రవహించాలన్న లక్ష్యంతోపాటు ఆ ప్రాంత పునరుజ్జీవనానికి ప్రభుత్వం నడుంకట్టిన విషయం విదితమే. కొన్ని అవాంతరాలున్నా
ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది.

అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో
నదీ పరీవాహక ప్రాంతాన్ని సంపద సృష్టించే ఆర్థిక నడవాగా, పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దితే భాగ్యనగరం స్వరూపమే మారిపో తుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా చేపట్టి బాపూఘాట్ త్రివేణి సంగమం వద్ద 200ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ లం బండ్లగూడ గ్రామం, రాజేంద్రనగర్ మండలంలోని హైదర్గాూడ, గోల్కొండ మండలంలోని ఖిలా మహ్మద్ నగర్ గ్రామాల పరిధిలో నాలుగు విభాగాలుగా విస్తరించి ఉన్న 83.814ఎకరాల భూమి తాజా ఉత్తర్వులలో ప్రభుత్వానికి దఖలు పడనున్నాయి. వర్కింగ్ పర్మిషన్ అందినందున మూసీ నదీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ భూ సర్వే చేపట్టి పనులు ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టు లోనే పర్యాటక శాఖకు చెందిన 36 ఎకరాలున్నందున ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో నిర్మించి ప్రాజెక్టు చేసేందుకు అన్ని వనరులు దక్కాలన్న లక్ష్యం పూర్తి ప్రాజెక్టుతో హైదరాబాద్అభివృద్ధిలో అందున గాంధీ సరోవర్ మూసీనదీ పరివాహక ప్రాంతాన్ని అభి వృద్ధి చేయడంవలన నగరంలో మరిన్ని సౌకర్యాలు ఏర్ప డతాయని నగర ప్రజలు ఆనందిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం కూడా ఈప్రాజెక్టు అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో ఉన్నం దునే రక్షణశాఖ భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేయ డంలో ఎలాంటి అసౌకర్యం కలగలేదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రక్రియను పూర్తి చేయడం లో చేసిన సహకారానికి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు.
నగర వాసులకు వరంగా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకా రముంటే రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టులుసజావుగా పట్టాలెక్కుతాయనడానికి నేటి క్లియరెన్స్ నిదర్శనం. కేవలం పేరుకే కాకుండా గాంధీతత్వశాస్త్రాన్ని బోధించే అతి పెద్ద మ్యూజియంను ఈప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తారు. పర్యాటకంగా ఈప్రాంతం విశేష అభివృద్ధికి వీలైన అన్ని ప్రణాళికలనూ ఈ ప్రాజెక్టులో చేర్చింది. ఇవన్నీ నగర వాసులకు వరంగానే చెప్పాలి. మూసీ, ఇసా నదుల సంగమస్థలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గుజరాత్లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు స్థాయిలో వెలుగొందగలదు. ఆశయం ఎంత గొప్పదైనా అమలులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడం కష్టమేనని ఏ భారీప్రాజెక్టు అయినా వెల్లడిస్తుం ది. మహాత్మా గాంధీ అస్థికలు నిమజ్జన ప్రదేశంలో ఈ ప్రాజెక్టు తలపెట్టినందున ప్రాజెక్టుకు సంబంధించిన నామకరణంపై ఇబ్బందులు రావు. మూసీ నిర్వాసితుల వ్యవహారమొక్కటే పకడ్బందీగా పరిష్కరించుకోగలిగితే మూసీ నది ప్రాజెక్టులో జలసిరులు పొంగుతాయి. గాంధేయ విలువలతో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, సాసం్కృతిక కేంద్రాన్ని కొత్త తరానికి పరిచయం చేయడం ఎంతో అవసరం.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: