Food Security: ఆహార భద్రతకు జన్యుమార్పిడి పంటలే ప్రత్యామ్నాయం

Follow Us: Google News Daily Hunt
Food Security
Food Security
FONT SIZE
GET APP

Food Security: ఇరవై ఒకటో శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించడం, వాతావరణ మార్పుల నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రధానమైనవి. ఈ రెండు కీలక అంశాల మధ్య నలిగిపోతున్న ఒక వివా దాస్పద సాంకేతికత ‘జన్యుమార్పిడి పంటలు’. ఒక జీవి లోని కావలసిన గుణాలను కలిగి ఉన్న జన్యువును వేరు చేసి, మరొక మొక్క డి.ఎన్.ఎలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఈ పంటలను సృష్టిస్తారు. అయితే ఈ సాంకేతికత ఆకలి బాధలను తీర్చే అమృతభాండమా లేక ప్రకృతి సమతుల్య తను దెబ్బతీసే పర్యావరణ ముప్పాఅనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలమధ్య తీవ్రమైన చర్చసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాగుభూమి క్రమంగా తగ్గిపోతుండటం, నీటి కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సాంప్రదాయ వ్యవసాయం ద్వారా డిమాండ్కు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఒక బలమైన ప్రత్యామ్నాయం గా కనిపిస్తున్నాయి. ఈ సాంకేతికత ద్వారా రూపొందిం చిన విత్తనాలు తక్కువ విస్తీర్ణంలోనే అత్యధిక దిగుబడిని సాధించగలవు. అంతేకాకుండా, వాతావరణ మార్పులను తట్టుకునేలా అంటే కరవు, మితిమీరిన వేడి, చలి లేదా నేలలో లవణీయత వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇవి స్థిరమైన దిగుబడిని ఇస్తాయి. పోషకాహార లోపాన్ని అధిగమించడంలో కూడా ఈ పంటల పాత్ర గణనీయ మైనది.

Read Also : Fine-grain rice : సన్నబియ్యం నణుగుడు!

Food Security
Food Security

Food Security: ‘బయోఫోర్టిఫైడ్’ పంటలు

మూడో ప్రపంచ దేశాల్లో విటమిన్ ‘ఎ’ లోపం వల్ల లక్షలాది మంది పిల్లలు అంధత్వానికి గురవుతున్నారు. దీనిని నివారించడానికి శాస్త్రవేత్తలు బీటాకెరోటిన్ పుష్కలంగా ఉండే ‘గోల్డెన్ రైస్’ను అభివృద్ధి చేశారు. ఇలాంటి ‘బయోఫోర్టిఫైడ్’ పంటలు పేదరికంలో ఉన్న ప్రజలకు చౌకగా పోషకాలను అందించడానికి ఉపయోగ పడతాయి. అలాగే, తెగుళ్లు, కీటకాల నిరోధకత కలిగిన బి.టి. పత్తి, బి.టి. వంగ వంటి పంటల వల్ల రసాయన పురుగుమందుల వాడకంతగ్గి, రైతులకు పెట్టుబడి వ్యయం కలిసివస్తుందనేది మద్దతుదారుల బలమైన వాదన. జన్యు మార్పిడి పంటల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, అవి పర్యావరణానికి, మానవ మనుగడకు కలిగించే నష్టాలు అంతకంటే తీవ్రమైనవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తు న్నారు. ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామానికి భిన్నం గా జన్యువుల ను మార్చడం వల్ల జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకే రకమైన జన్యుమార్పిడి పంటలను సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల, శతాబ్దా లుగా వస్తున్న స్థానిక సంప్రదాయ విత్తనరకాలు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉంది. మరో ప్రధాన పర్యా వరణ సమస్య ‘సూపర్ వీడ్స్ అంటే మహా కలుపు మొక్కలు, ‘సూపర్ బగ్స్’ ఆవిర్భావం.. కలుపునాశకాలను తట్టుకునేలా రూపొందించిన జన్యుమార్పిడి పంటల పొలా ల్లో నిరంతరం ఒకే రకమైన రసాయనాలు వాడటం వల్ల, ఆ రసాయనాలకు లొంగని శక్తివంతమైన కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయి.

Food Security
Food Security

సురక్షితమైన సాంకేతికతను అందించాలి

అలాగే, హానికర కీటకాలను చంపడానికి మొక్కలోనే ఉత్పత్తిఅయ్యే విషపూరిత ప్రోటీన్లు, కాలక్రమే ణా పర్యావరణానికి మేలు చేసే తేనెటీగలు, సీతాకోకచిలు కలు, నేలలోని మిత్రపురుగులను కూడా నాశనం చేస్తున్నా యి. మానవ ఆరోగ్యంపై వీటిదీర్ఘకాలిక ప్రభావాల గురించి సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, అలర్జీలు, యాంటీ బయాటిక్ నిరోధకత వంటి సమస్యలు తలెత్తవచ్చనే ఆం దోళనలు వినియోగదా రుల్లో ఉన్నాయి. ఆర్థిక కోణంలో చూస్తే, జన్యుమార్పిడి విత్తనాలపై బహుళజాతి కార్పొరేట్ కంపెనీల పేటెంట్ హక్కులు కలిగిఉండటం వల్ల వ్యవ సాయ రంగంపై కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుంది. రైతులు ప్రతి ఏటా సొంతంగా విత్తనాలను దాచుకునే హక్కును కోల్పోయి, కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో కఠినమైన నియంత్రణ కూడా అత్యంత అవసరం. ఏ దేశమైనా జన్యుమార్పిడి పంటలను అనుమతించే ముందు స్వతంత్ర పారదర్శకమైన క్షేత్ర స్థాయి పరిశోధనలు జరపాలి. లాభాపేక్షతో కూడినప్రైవేట్ కంపెనీల పరిశోధనల పై మాత్రమే ఆధారపడకుండా, ప్రభుత్వ రంగ సంస్థలే స్వయంగా పరిశోధనలు చేపట్టి రైతులకు తక్కువ ధరలో సురక్షితమైన సాంకేతికతను అందించాలి. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే, ఆకలిలేని సమాజాన్ని నిర్మిం చాలంటే సైన్స్ అందించే అద్భుతాలను ప్రకృతి నియమాలకు లోబడి, గట్టి నిఘా నీడలో ఉపయోగించుకోవడమే మానవాళికి శ్రేయస్కరం.

-డి వి బి శ్రీహరిన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు