Elections : ఎన్నికల కోసం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి!

Follow Us: Google News Daily Hunt
Elections
Elections
FONT SIZE
GET APP

Elections : ‘సర్ వేరిఫికేషన్ వెడల, కొత్త ఓటర్ల నమోదు వెడల, ఏకపక్ష నిర్ణయాలతో 13కోట్ల ఓట్లను తొలగించి ఎన్ని కల్లో ఎన్డీఏకి ప్రయోజనం చేకూర్చటమే లక్ష్యంగా వ్యవ హరిస్తున్న ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కాక్రోచ్ జనతాపార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. సీఈసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాలపై దాఖలైనపిటిషన్లపైన సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సీఐసీ నిర్ణయాలు పార్ల మెంటరీ ఎన్నికల భూటకత్వాన్ని మరొకసారి వెల్లడించింది. దేశంలోని ఎన్నికల వ్యవస్థ ఎంతో ప్రజాస్వామ్యం, పవిత్ర మైనదిగా ప్రచారం చేస్తున్న పాలక పార్టీలు; ఆ ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యంగా మార్చడం ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య డొల్లతనం బయటపడింది. సీఐసీ రాజీనామా ఉద్యమ నేపథ్యంలో దేశంలో పార్లమెంటరీ ‘ప్రజాస్వామ్యం’ అమలు జరుగుతున్న తీరు ఏమిటన్నది ప్రశ్నించుకోవాలి. అధికార మార్పిడి జరిగిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికల దగ్గర నుండి నేటి వరకు పాలక పార్టీలు, ప్రభు త్వాలు ఎన్నికల్లో గెలవడానికి డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్, కులం, మతం, ప్రాంతం అన్నిటిని ఉపయోగించాయి. నేడు డబ్బులు, రిగ్గింగ్, కులం, మతం ఉపయోగించ కుండా ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి పాలక పార్టీలకు ఏర్ప డింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ కేంద్ర ప్రభుత్వ ప్రయో జనాలకు అనుకూలమైన నిర్ణయాలే చేస్తారు, చేశారు. ‘నర్’ అమలు తీరు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓట్ల తొల గింపు ఏకపక్ష నిర్ణయాలు అందులో భాగంగా జరిగిందే. ఆయన మాతో సంప్రదించకుండా, మా అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మిగతా ఇద్దరు సభ్యులు చెప్పింది బయటకు రావడం ప్రస్తుత ఆందోళనకు కారణమైంది.

Read Also : Diljit Dosanjh: దిల్జీత్ దోసాంజ్ వివాదానికి ఎండ్ కార్డ్.. అభిజీత్ దిప్కే కీలక ప్రకటన!

Elections
Elections

Elections : సమూల మార్పు కోసం

ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు వినియోగం, మద్యం, అధికారులను ప్రభావితం చేయడం నిరంతర ప్రక్రియగా ఉంది. సామాన్యుడుకి ఎన్నికల్లో పోటీ చేయడమనే ఆలోచనే రావడం లేదు. ప్రస్తుత ఎన్ని కల విధానం సంపన్న వర్గాలకే పరిమితంగా ఉంది. అలాంటప్పుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామ కోరడమే సరిపోదు. ఎందుకంటే, భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థ ఒక భాగం. దానికి రాజ్యాంగం, దాని ప్రతినిధి అయిన ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. సంపన్న వర్గాల ప్రయోజనాలకు రక్షణగా ఉంటూ, పేద సామన్య ప్రజల ప్రయోజనాలు కా పాడటంలో పూర్తిగా విఫమైంది. అందు వల్ల రాజ్యాంగం సమూలంగా మార్పు చెందకుండా ఎన్ని కల వ్యవస్థ ప్రజాస్వామికంగా ఉండదు. రాజ్యాంగ మార్పు ను సీజేపీ కోరుకోకపోగా సమర్థిస్తున్నది. సీఈసీ పరిణా మాల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ భూటకత్వాన్ని బట్ట బయలు చేయాలి. కాంగ్రెస్, ఇతర పాలక పార్టీలు ఆపని చేయవు. దేశ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు పిలుపు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా, ఎన్నికల విధా నంలో మౌలిక మార్పులు రావు. దేశంలో నిరుద్యోగం, అవినీతి, పేదరికంతో యువత, విద్యార్థులు, గ్రామీణ పేదలు సతమతం అవుతున్నారు. యువత ఈ సమస్యల వైపు కదిలినప్పుడే ఉద్యమానికి సరైన వునాది ఏర్పడు తుంది. దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఎన్నికల అధికారి రాజీ నామాను డిమాండ్ చేస్తూనే, ప్రజాస్వామ్య ఎన్నికలవ్యవస్థ కోసం, ఉద్యోగ, ఉపాధి కోసం, పేదరికం తొలగింపు కోసం యువత, విద్యార్థులు, గ్రామీణ, పట్టణ పేదలతో కలిసి రాజ్యాంగం సమూల మార్పు కోసం ఉద్యమించాలి.

-బొల్లిముంత సాంబశివరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు