Donations: తెరచాటు దొర తంత్రం!

Follow Us: Google News Daily Hunt
Donations
Donations
FONT SIZE
GET APP

Donations: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు నిధులు చేర డం తప్పేమీ కాదు. కానీ ఊరూపేరులేని పార్టీలను నమ్మి ప్రజలు అంతలేసి మొత్తంలో విరాళాలు ఇస్తారా. అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. విరాళాలిచ్చేవారు జనాదరణ లేని పార్టీల నుంచి ఏమీ ఆశించలేమని తెలిసీ ఎందుకు విరాళాలు ఇస్తారో పలు విషయాలపై దృష్టి పెడితేనే విశ్లేషించుకోగలం. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏమాత్రం జనంలో లేని రాజకీయ పార్టీలకు దాదాపు రూ.1700 కోట్ల మేరకు విరాళాలు అందాయి. అవి ఎక్కడ్నించి వచ్చాయి. ఎవరి కోసం దేనికోసం ఈ విరాళాలు పోగుపడ్డాయి. ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరైనా ఎందుకిస్తారు? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. పైగా రాజకీయ పార్టీలకి ఇచ్చే ప్రతి రూపాయి ప్రజావిశ్వాసంతో ముడిపడి ఉంటాయి. రాజకీయ చైతన్యంలో మ మేకమై విస్తృత రాజకీయకార్య కలాపాలు చేసే పార్టీలకు కోట్లాది రూపాయలు విరాళ మిచ్చే దాతలు ఆయా పార్టీల నుంచి ఏం ఆశిస్తున్నారన్న నేపథ్య ఎజెండా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనలేం. గుజరాత్లో కొన్ని రాజకీయ పార్టీలు అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు. వాటి జెండా, ఎజెండా కూడా ఏదో కానరావు. కానీ 2023-24 ఆర్థిక సంవత్స రంలో ఆరు చిన్న చితక పార్టీలకు రూ.1700 కోట్ల రూపాయలు ఎలా జమ అయ్యాయి. ఈ సొమ్మును వారు ఖర్చు పెట్టేందుకు వారికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేవు. ఎలాంటి కార్యాచరణ కూడా లేదు. దీంతో ఈ విరాళాల అసలు సిసలు లబ్దిదారులెవ రో తేలాల్సి ఉంది.

Read Also : Harish Rao: ఇది BRS సస్పెన్షన్ కాదు, ప్రజా సమస్యల సస్పెన్షన్.. హరీశ్ రావు

Donations
Donations

Donations: నగదు ప్రవాహాన్ని దారి మళ్లించడానికి

ఒకవేళ బడా రాజకీయ నాయకుల కొమ్ము కాసేందుకే ఈ చిన్నాచితకా పార్టీల పేర్లను నమోదు చేసారా అన్న అనుమానాలు రేకెత్తకమానవు. ఆమ్ జన్మత్ పార్టీకి రూ.620 కోట్లు, సత్యవాది రక్షక్ పార్టీకి రూ.330.55 కోట్లు, స్వతంత్రత అభివ్యక్తి పార్టీకి రూ.200.69 కోట్లు, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీకి రూ.200.69 కోట్లు, భారతీయ నేషనల్ జనతా దళ్లు రూ. 191.61 కోట్లు, గరీబ్ కళ్యాణ్ పార్టీకి రూ. 138కోట్లు మేరకు విరాళాలు జమపడ్డాయి. ఆయా పార్టీ లకు2024 ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చరిత్ర ఉంది. ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. అందరికన్నా ఎక్కువ మొత్తంలో విరా కాలు పొందిన ఆమ్ జన్మత్ పార్టీ అత్యధిక విరాళాలు అందుకున్న స్థాయిలో రెండవది అయిన సత్య వాది రక్షక్ పార్టీలైతే ఒక్కో అభ్యర్థిని మాత్రమే నిలబెట్టాయి. ఎవరి ప్రోద్బలంతో ఈ పార్టీలు ఏర్పడ్డాయో పూర్తి సమాచారం లేకపోయినా వీరి వెనుక ఏదో బలమైన వ్యక్తుల నేపథ్య మే ఉంటుందన్నది నిర్వివాదాంశం. కానీ ఎవరు ఆయా పార్టీలనుమౌనంగా నడుపుతున్నారో తెలిస్తే మరో మాయ బజార్ బయటపడ్తుంది. ఇలాంటి అంశాలు భారతీయ రాజకీయ వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నించే అంశాలుగా మిగిలిపోతాయి. ఆయా రాజకీయ పార్టీలకు చేరిన నిధులుపార్టీ రాజకీయ కార్యకలాపాల కోసమేనా లేదా మరొక మార్గంలో నగదు ప్రవాహాన్ని దారి మళ్లించడానికి చిన్న రాజకీయ పార్టీల సృష్టి జరుగుతోందా అన్నది తేలాలి. 2024-25 అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఎన్నికల సంఘానికి పార్టీలు ఇచ్చిన నివేదికల మేరకు జాతీయ పార్టీల ఆదాయం లెక్కలు గమనిస్తే భారతీయ జనతాపార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐ(ఎం) ఆప్, బిఎసిపి, ఎన్పిఇపిల ఆదాయం మొత్తం రూ.7,960.09 కోట్లు. వాటిలో 85శాతంతో బిజెపి ప్రథమ స్థానంలో ఉంది.

Donations
Donations

పార్టీలు విరాళాల మీద ఆధారపడటం

ఆయా పార్టీల కార్యక్రమాల నిర్వహణ పరిస్థితులు ప్రధాన పార్టీలకు చేరిన నిధులను బట్టికొంత సమంజన మేనని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో ఉన్న పార్టీల నిధుల రాబడి చూస్తే చెప్పుకోదగిన మొత్తాలు కావు. పార్టీలు విరాళాల మీద ఆధారపడటం పెద్ద తప్పేమీ కాదు కానీ అనామక పార్టీలకు అన్నేసి కోట్ల నిధులెలా వచ్చాయన్నది సర్వులు తెలుసుకోదగిన విష యమే. ఫిబ్రవరి 2024లో ఎలక్టోరల్ బాండ్లను సుప్రీం కోర్టు రద్దుచేశాక పార్టీల ఆదాయం కాస్త తగ్గింది కూడా. కాగా కొన్ని చిన్న పార్టీలకు పోగుపడిన విరాళాల సంగతే సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ బీహార్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న అనామిక పాశ్వాన్ ఆధ్వర్యంలో 2020 పట్నాలో స్థాపించిన ఆమ్ జన్మత్ పార్టీకిఅత్యధిక నిధులు వసూళ్లయ్యాయి. ఇలాంటి నిధు లున్న ఖాతాలన్నీ అహ్మదాబాద్ లోనే ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రమే ఓ బడాపారిశ్రామిక నగరం కనుక ఆయా అనా మిక పార్టీలకు పారిశ్రామికవేత్తలే విరాళాలు ఇచ్చి ఉంటా రని ఊహించవచ్చు. రాజకీయ పార్టీల నిర్వహణకే ఆ నిధులు ఖర్చుపెట్టాలని నిబంధన ఏదీలేకపోయినా ఎన్ని కల కార్యక్రమాలకు పరిమితుల మేరకు వినియోగించ వచ్చు. విచిత్రమేమిటంటే వాటిలో సత్యవాది రక్షక్ పార్టీ తనకు వచ్చిన రూ.330 కోట్లలో రూ.316 కోట్లను సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఆయా పార్టీలకు చేరిన విరాళాలు ఎవరె వరు ఏయే రాజకీయ ప్రయోజనాలను ఆశించి వారికి ఫండ్స్ పంపినదీ తెలిస్తే తప్ప విరాళాల నేపథ్యం వాటి ఫలితాల గురించి తెలియదు. ఒకసారి పార్టీ కార్యకలాపా లకు ఆ పార్టీకివచ్చిన నిధులకు మధ్య అసమానత తీవ్రంగా ఉన్నప్పుడు అనేక సందేహాలు తలెత్తకమానదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరగా లో చెప్పుకునే ప్రజలు ఎన్నికలకు నిధులు సమకూరే మూలాలపై ఎలాఉండాలో నిర్దేశించవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుతర్వాత ఎన్నికల్లో నిధుల ప్రవాహం పార్టీలకుఅందే విరాళాల విషయంలో పారదర్శకత పెరిగినా, తెలియని వనరుల ద్వారా వచ్చే ఆదాయం ఇంకా ప్రశ్నార్థకమే!.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు