Digital currency : డిజిటల్ కరెన్సీతో ఆర్ధిక వ్యవస్థకు మరింత భద్రత

Follow Us: Google News Daily Hunt
Digital currency
Digital currency
FONT SIZE
GET APP

Digital currency : సాంకేతిక విప్లవం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను వేగంగా రూపాంతరం చెందిస్తోంది. ఒకప్పుడు వస్తు మా ర్పిడి విధానం నుంచి నాణేలు, కాగితపు నోట్లు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపుల వరకు అభివృద్ధి చెందినద్రవ్య వ్యవస్థ ఇప్పుడు కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ యుగం లోకి అడుగుపెట్టింది. ఈ మార్పులో భాగంగానే భారతీ య రిజర్వ్ బ్యాంకు డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారంచుట్టింది. డిజిటల్ రూపాయి అనేది మనం వినియోగించే కాగితపు నోట్లకు డిజిటల్ రూపం. ఇది సాధారణ డిజిటల్ చెల్లింపు విధానాలైన యూపీఐ లేదా మొబైల్ వాలెట్లతో సమానం కాదు. యూపీఐలో ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక ఖాతాకు నిధులు బదిలీ అవుతాయి. అయితే డిజిటల్ రూ పాయి విషయంలో డబ్బు స్వరూపమే డిజిటల్గా ఉంటుం ది. ఇది నేరుగా ఆర్ బీఐ జారీచేసే చట్టబద్ధమైన అధికారిక కరెన్సీ కావడంతో భౌతిక నగదుకు సమానమైన విశ్వసనీ యతను కలిగి ఉంటుంది. డిజిటల్ రూపాయి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

Read Also : Demonetization of currency notes : రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Digital currency
Digital currency

Digital currency : ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత

కరెన్సీ నోట్ల ముద్రణ, రవాణా, భద్ర త, నిర్వహణ వంటి వ్యయాలు తగ్గుతాయి. లావాదేవీలు వేగంగా, సులభంగా పూర్తవడంతో సమయం ఆదా అవు తుంది. నగదు వినియోగం తగ్గడంవల్ల నకిలీ నోట్ల సమ స్యను నియంత్రించడంతో పాటు ఆర్థికవ్యవస్థలో పారద ర్శకత పెరుగుతుంది. చిన్న మొత్తాల చెల్లింపుల నుంచి పెద్ద లావాదేవీల వరకు దీన్ని వినియోగించే అవకాశం ఉంది. బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం హోల్ సేల్ డిజి టల్ రూపాయి, సాధారణ ప్రజల కోసం రిటైల్ డిజిటల్ రూపాయిని ఆర్టీఐ దశలవారీగా ప్రవేశపెడుతోంది. డిజి టల్ రూపాయి వ్యాపార రంగానికి కూడా మేలు చేస్తుంది. నగదు నిర్వహణ ఖర్చుతగ్గడం, తక్షణ చెల్లింపులు, మెరు గైన నగదు ప్రవాహం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పన్నుల వసూళ్లు, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ చెల్లింపులను మరింత వేగవంతంగా, తక్కువ వ్యయంతో నిర్వహించే అవకాశాలను కూడా ఇది విస్తరించగలదు. అదేవిధంగా, డిజిటల్ రూపాయి డిజిటల్ ఇండియా, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ వంటి జాతీయ లక్ష్యాలకు మరింత బలం చేకూరుస్తుంది. బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందని ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలను విస్తరించే అవకాశాన్ని కల్పి స్తుంది. విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా అందిం చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

Digital currency
Digital currency

భవిష్యత్ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాది

అయితే డిజి టల్ కరెన్సీ విజయవంతం కావాలంటే కొన్ని సవాళ్లను అధిగ మించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలమౌలిక సదుపాయాల విస్తరణ, సైబర్ భద్రత బలోపేతం, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు, వినియోగదారుల గోప్యత పరి రక్షణ వంటి అంశాలకు అధికప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యం గా వృద్ధులు, గ్రామీణ ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉన్నవర్గాలకు విస్తృత స్థాయిలో అవ గాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. డిజిటల్ రూపాయిని బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలతో పోల్చడం సరైందికాదు. క్రిప్టోకరెన్సీలు మార్కెట్ ఆధారం గా విలువ మారే ప్రైవేట్ డిజిటల్ ఆస్తులు కాగా, డిజిటల్ రూపాయి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసే అధికారిక చట్టబద్ధకరెన్సీ. ప్రపంచంలోని అనేకదేశాలు కేంద్రబ్యాంకు డిజిటల్ కరెన్సీలను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, భారత దేశం కూడా ఈ రంగంలో ముందంజలో నిలుస్తోంది. డిజి టల్ కరెన్సీ సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, భవిష్యత్ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాది. సమర్ధవంతమైన నియంత్రణ, అత్యున్నత భద్రతా ప్రమాణాలు, బలోపేత మైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రజల విశ్వాసం కలిసి నడిస్తే డిజిటల్ రూపాయి భారత ఆర్ధిక వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది.

-సి. హెచ్. ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు