Declining birth rates: తగ్గుతున్న జననాలతో మారుతున్న జనాభా చిత్రం

Follow Us: Google News Daily Hunt
Declining birth rates
Declining birth rates
FONT SIZE
GET APP

Declining birth rates : భారత్ జనాభా నిర్మాణంలో నిశ్శబ్దంగా ఒక కీలక మార్పు చోటు చేసుకుంటోంది. ఒకవైపు మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎస్ఆర్) తగ్గుతుండగా, మరోవైపు వృద్ధుల జనాభా క్రమంగా పెరు గుతోంది. ఈ రెండు పరిణామాలు భవిష్యత్ ఆర్థికవ్యవస్థ, ఆరోగ్యరంగం, సామాజిక భద్రతపై గణనీయ ప్రభావం చూపనున్నాయి. జనాభా పెరుగుదల మాత్రమే కాదు, జనాభా నాణ్యత, వయో నిర్మాణం కూడా అభివృద్ధికి కీలకమనే విషయాన్ని విధాన నిర్ణేతలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచికనే మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎస్ఆర్) అంటారు. సాధారణంగా 2.1ను ప్రత్యా మ్నాయ జననాల రేటు (రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ)గా పరిగణిస్తారు. ఈ స్థాయిలో జననాలు కొనసాగితే జనాభా దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుంది. అంతకంటే తక్కువగా ఉంటే భవిష్యత్లో యువజనాభా తగ్గేఅవకాశం ఉంటుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారత్లో 2019-21 నుంచి 2023-24 వరకు మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0 వద్దే స్థిరంగా కొనసాగింది. ఇది ప్రత్యామ్నాయ స్థాయి కంటే తక్కువ. దాదాపు ప్రతి రాష్ట్రంలో టీఎస్ఆర్ తగ్గడం లేదా స్థిరంగా ఉండడం గమనార్హం.

Read Also : Tekmal 108: మెదక్‌లో 108 అంబులెన్స్‌లోనే ప్రసవం

Declining birth rates
Declining birth rates

Declining birth rates : సామాజిక ఆర్థిక అంశాలు

అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో మాత్రం స్వల్ప పెరుగుదల నమో దైంది. మరోవైపు బీహార్ లో దేశంలోనే అత్యధిక టీఎస్ఆర్ 2.7గా ఉన్నప్పటికీ, గతంలో నమోదైన 3.0తో పోలిస్తే తగ్గుముఖం పట్టడం విశేషం. సంతానోత్పత్తి రేటు తగ్గడం అంటే కుటుంబ నియంత్రణ విజయవంతమైందనిమాత్రమే అర్థం కాదు. విద్యావకాశాల పెరుగుదల, మహిళలఉపాధి, పట్టణీకరణ, వివాహాల ఆలస్యం, జీవన వ్యయం పెరగడం వంటి అనేక సామాజిక ఆర్థిక అంశాలు దీనికి కారణమవు తున్నాయి. అయితే దీర్ఘకాలంలో యువ జనాభా తగ్గిపో వడం వల్ల శ్రామిక శక్తి క్షీణించే ప్రమాదం కూడా ఉంది. అదే సమయంలో భారత్లో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, తూర్పు ఆసియా దేశాలు అధిక ఆదాయ స్థాయికి చేరుకున్న తర్వా త వృద్ధాప్య సమాజాలుగా మారాయి. కానీ భారత్మాత్రం దిగువమధ్య ఆదాయ దేశంగానే కొనసాగుతూనే వృద్ధాప్య సమాజం వైపు అడుగులు వేస్తోంది. ఇది దేశానికి కొత్తసవా లుగా మారనుంది.

Declining birth rates
Declining birth rates

సమతుల్య జనాభా

ప్రస్తుతం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వృద్ధులకు అవసరమైన బహుళ వ్యాధులచికిత్స కు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవు. గుండె జబ్బులు, మధు మేహం, రక్తపోటు, కీళ్ల వ్యాధులు, మతిమరుపు వంటినమ స్యలు ఒకేసారి ఎదుర్కొనే వృద్ధులకు ప్రత్యేక జెరియాట్రిక్ కేర్ అవసరం. అధికశాతం వృద్ధులు ఇప్పటికీ స్వల్పమొత్తం లోని ప్రభుత్వ పింఛన్లపైనే ఆధారపడుతున్నారు. ఇదివారి ఆర్థిక భద్రతకు సరిపోదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచు కుని ప్రభుత్వం సమగ్ర జనాభా విధానం రూపొందించాలి. ప్రతిజిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక జెరియాట్రిక్ వార్డులు ఏర్పా టు చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధులకుఅను కూల సేవలు విస్తరించడం, లాంగ్ టర్మ్ కేర్ వ్యవస్థను అభి వృద్ధి చేయడం అవసరం. సామాజిక భద్రతా పింఛన్లను పెంచడంతోపాటు, హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిని విస్తరించాలి. యువతకు నైపుణ్యాభివృద్ధి, మహిళల ఉపాధి, కుటుంబా లకు శిశు సంరక్షణ సౌకర్యాలు కల్పించడం ద్వారా సమ తుల్య జనాభా నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. జనాభా మార్పులను కేవలం గణాంకాలుగా కాకుండా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చూడాలి.

-సి.హెచ్. ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు