Cybercrimes : సైబర్ నేరాల కట్టడికి అవగాహనే ఆయుధం

Follow Us: Google News Daily Hunt
Cyber Crime
Cyber Crime
FONT SIZE
GET APP

Cybercrimes : డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని అపూర్వంగా సులభతరం చేసినప్ప టికీ, అదే సాంకేతికతను దుర్విని యోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్ము, వ్యక్తిగత సమాచారం, గోప్యతపై దాడులు చేయడం ఆందోళ నకరంగా మారింది. నగదులావాదేవీల స్థానంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్వాలెట్లు, ఆన్లైన్ కొనుగోళ్లు, సామాజిక మాధ్య మాల వినియోగం విస్తరించడంతో సైబర్ నేరాలకు అవకాశా లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం సమాచార సాంకేతిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నప్పటికీ, అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుండటం ప్రజలను, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా 7 హైదరాబాద్ వంటి ఐటీ మహానగరంతో పాటు జిల్లాలకూ సైబర్ మోసాల విస్తరణ జరగడం ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. కొన్ని సంవత్సరాలక్రితం వరకు సైబర్ నేరాలు ప్రధానంగా ఈమెయిల్ మోసాలు, ఏటీఎం కార్డుల క్లోనింగ్, క్రెడిట్ కార్డు మోసాలకు మాత్రమే పరిమి తమయ్యేవి.

Read Also : Flipkart Freedom Sale 2026: ‘ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్’.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లుపై భారీ ఆఫర్లు!

Cybercrimes
Cybercrimes

Cybercrimes : బ్యాంకు ఖాతాలు ఖాళీ

ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డీప్ ఫేర్ సాంకే తికత, నకిలీ వెబ్సైట్లు, నకిలీ మొబైల్ యాప్లు, సామా జిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులు, ఓటీపీలు, యూపీఐ అభ్యర్ధనలు, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బు దోచుకునే కొత్త పద్ధతులు విస్తృతంగా పెరిగాయి. నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మరింత చురుకుగా మారుతుండగా, సాధారణ ప్రజలలో అవగాహన అంతే వేగంగా పెరగకపో వడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. తెలంగాణలో ప్రతి నెల వేల సంఖ్యలో సైబర్ మోసాలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. కోట్ల రూపాయల మేర ప్రజలు ఆర్థి కంగా నష్టపోతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చిన్న వ్యాపారులు, ప్రైవేటు ఉద్యో గులు, ఐటీ నిపుణులు సైతం ఈమోసాల బారినపడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. అత్యంత విద్యావంతులు కూడా నేరగాళ్ల మానసిక వ్యూహాలకు మోసపోవడం ఈ నేరాల స్వరూపాన్ని తెలియజేస్తోంది. ఒక్కసారి బ్యాంకు వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ లేదా వ్యక్తిగత సమాచా రం నేరగాళ్ల చేతికి చేరితే కొన్ని నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.

అప్రమత్తతే మొదటి రక్షణ

ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారిన నేరాల్లో ‘డిజిటల్ ఆరెస్టు’ మోసాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు అధికారులు, న్యాయస్థానాల పేర్లు చెప్పి వీడియో కాల్ల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ గంటల తరబడి ఫోన్లోనే ఉంచి వారి నుంచి లక్షల రూపాయలు బదిలీ చేయించుకునే సంఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూశాయి. అలాగే పెట్టుబడి పెడితే రోజుల్లోనే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మిస్తూ నకిలీ ట్రేడింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు కాజేసే సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల పెరుగుదలకు ప్రజల నిర్లక్ష్యం కూడా కొంత కారణమవుతోంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లింక్లను తెరవడం, అపరిచిత యాప్లను డౌన్లోడ్ చేయడం, ఓటీపీలు చెప్పడం, క్యూఆర్ కోడ్లను విచక్షణారహితంగా స్కాన్ చేయడం, సామాజిక మాధ్య మాల్లో వ్యక్తిగత వివరాలను అధికంగా పంచుకోవడం, ఒకే సంకేత పదాన్ని అన్ని ఖాతాలకు ఉపయోగించడం వంటి అలవాట్లు నేరగాళ్లకు అవకాశాలను కల్పిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా వినియోగదారుడి అప్ర మత్తతే మొదటి రక్షణగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపడుతోం ది. రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లు, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేసింది.

ప్రతి ఖాతాకు వేర్వేరు సంకేత పదాలు

సాంకే తిక నిపుణుల సహకారంతో నేరాల దర్యాప్తు, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, నిధుల ట్రాకింగ్ వంటి చర్యలు వేగ వంతమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాల యాలు, ప్రజా వేదికలలో అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తూ సైబర్ భద్రతపై ప్రజలకు సూచనలు అందిస్తున్నారు. సైబర్ నేరాలపై తక్షణ ఫిర్యాదుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన జాతీయ సైబర్ హెల్ప్ లైన్1930కు వెంటనే సమాచారం ఇ వ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ ఫిర్యాదు వేదిక ద్వారా కూడా బాధితులు ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. మోసంజరిగిన వెంటనే సమాచారం అందిస్తే నిధులను నిలిపివేసేఅవకాశం పెరుగుతుంది. సైబర్ నేరాల నివారణలో ప్రతి పౌరుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, ఒటీపీ, యూపీఐ పిన్, సీవీవీ సంఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదు. తెలియని లింక్ లను నొక్కకూడదు. అధికారిక యాప్లను మాత్రమే డౌన్ లోడ్ చేయాలి. ప్రతి ఖాతాకు వేర్వేరు బలమైన సంకేత పదాలను ఉపయోగించాలి. రెండు దశల ధృవీకరణ విధా నాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. బ్యాంకు లా వాదేవీల కు సంబంధించిన సందేశాలను ఎప్పటికప్పుడుపరిశీలించాలి. అనుమానాస్పద కాల్లువస్తే వెంటనే కాల్ నిలిపివేసి సం బంధిత సంస్థ అధికారిక నంబర్లకు సంప్రదించాలి.

Cybercrimes
Cybercrimes

అనుమానం వస్తే ఆగు – ధృవీక రించు – తరువాతే చర్య తీసుకో’

సామా జిక మాధ్యమాల్లో వ్యక్తిగతసమాచారం, కుటుంబవివరాలు, ప్రయాణ వివరాలు బహిరంగంగా పంచుకోవడాన్ని తగ్గిం చాలి. విద్యార్థులు, యువత, వృద్ధులు, మహిళలు వంటి వర్గాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత అవసరం. విద్యాసంస్థలలో డిజిటల్ భద్రతపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవే టు సంస్థల సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, బ్యాంకులు తమ వినియోగదారులకు తరచూ హెచ్చరిక సందేశాలు పం పించడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచడం వంటిచర్యలు సైబర్ నేరాల నియంత్రణకు దోహ దపడతాయి. అలాగే కృత్రిమ మేధస్సును ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించే వ్యవ స్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలను పూర్తిగా నిర్మూలించడం కష్టమైనప్పటికీ, వాటి ప్రభా వాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమే. ఇం దుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, బ్యాంకులు, సాంకేతికసంస్థలు, విద్యాసంస్థలు, మీడియా, ప్రజలు సమన్వయంతో పనిచే యాలి. చట్టాల అమలుతోపాటు వేగవంతమైన దర్యాప్తు, నేరస్థులకు కఠినశిక్షలు అంతర్రాష్ట్ర- అంతర్జాతీయ సహ కారం కూడా అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ప్రజల అవగాహన కూడా అంతే వేగంగా పెరగాలి. తెలంగాణ డిజిటల్ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో సైబర్ భద్రతను కూడా అదేస్థాయిలో బలోపేతం చేయడం కాలానుగుణ అవసరం. ప్రతి పౌరుడు’అనుమానం వస్తే ఆగు – ధృవీక రించు – తరువాతే చర్య తీసుకో’ అనే సూత్రాన్ని పాటిస్తే సైబర్ నేరగాళ్లకు అవకాశాలు గణనీయం గా తగ్గుతాయి. డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే అత్యంత విలువైన రక్షణ కవచం. సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రతా నియమాలను పాటించడం ద్వారానే సురక్షితమైన డిజిటల్ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది.

-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు