CEC: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీ నామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతున్నప్పటికీ జ్ఞానేశ్ కుమార్ మాత్రం జరుగుతున్న పరిణా మాలకు తనకేమి సంబంధంలేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం అమల్లో వున్న నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి పటిష్ట మైన రక్షణ వ్యవస్థ వుంది. చీఫ్ ఎన్ని కల కమీషనర్ తనంతట తానుగా రాజీనామా చేస్తే మినహా ఆయనను తొలగించడం లేదా భర్తరఫ్ చేయడం సులభం కాదు. రాజ్యాంగం ప్రకారం చీఫ్ ఎన్నికల కమీషనర్ తొలగించాలంటే సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే ఎటువంటి పద్ధతులు పాటి స్తారో అటువంటి పద్ధతినే పాటించాలి. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిని లేదా చీఫ్ ఎన్నికల కమీషనర్‌ను తొలగించే పద్ధతిని ఇంపీచ్మెంట్ అంటారు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌ను ఇంపీచ్మెంట్ చ్చేయాలంటే 100 లోక్ సభ లేదా 50మంది రాజ్యసభ్యలు ప్రతిపాదన చేస్తూ స్పీకర్/రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు అందచేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ కమీషన్ పై వచ్చిన ఆరోపణలపై ముగ్గరు సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరపాలి. ఆ తర్వాత ఉమ్మడి సభల పార్లమెంటు సమావేశంలో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదంతో తీర్మానం పాస్ చేయాలి. ఆ తీర్మానాన్ని రాష్ట్ర పతి ఆమోదించినప్పుడు మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమీషనరు తొలగించడం సాధ్యం అవుతుంది. అంతేకాకుండా ఎన్నికల కమీషనర్లపై అధికారంలో వుండగా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఎటువంటి క్రిమినల్ కేసులునమోదు చేయడానికి వీలులేదు.

CEC: రాజీనామా చేయాలనే ఆందోళన
భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం 1950లో ఏర్పడింది. ఆనాటి నుంచి 1993వ సంవత్సరం వరకు భారత ఎన్నికల సం ఘంలో ఒకే కమీషనర్ వుండేవారు. అయితే ఆచరణలో వచ్చిన నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2) ప్రకకారం ఎన్నికల సంఘం సభ్యుల సంఖ్యను ముగ్గురుకు పెంచారు. వీరి ముగ్గురుకి ఒకే విధమైన అధి కారాలు ఉంటాయని చెప్పినా ముగ్గురిలో ఒకరు చీఫ్ కమీ షనర్ వ్యవహారిస్తారు. ఎన్నికలకు సంబంధించి ముగురికి ఒకే విధమైన అధికారాలు వుంటాయి. ఏ నిర్ణయమైనా ముగ్గురు కలసి తీసుకోవాలి. అభిప్రాయ బేధాలు వచ్చినప్పు డు మాత్రం మెజారీటీ సభ్యులు అంటే ముగ్గురిలో ఇరు వురు సభ్యులు నిర్ణయాన్ని అమలు చేయాల్సి వుంటుంది. సర్ ప్రక్రియ ప్రారంభం ‘విషయంలో ముగ్గురు సభ్యుల ఆమోదం లేకుండా చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఏక్షపక్షంగా తీసుకున్నారని మిగిలిన సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు కూడా వారు ప్రకటించారు. ఈ అంశాన్ని ఒక ఆంగ్ల పత్రిక బహిర్గతం చేసింది. ఆనాటి నుంచి సర్ రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీనామా చేయాలనే ఆందోళన ప్రారంభమైంది.
ఇంపీచ్మెంట్ విధానం అవసరం లేదు
నిజానికి పత్రికలో ఈ అంశాలు ప్రచురితం కాకముందే సర్ ప్రక్రియలో అక్రమాలు జరుగు తున్నాయని. నర్ పేరుతో దేశ తొలగించారని ఆయా రాష్ట్రాల నాయకుల ఆరోపణలు వచ్చినప్పటికీ ఆధారాలు బయటకు రాలేదు. అయితే ఆ ఆంగ్ల పత్రికలో ఆధారాలు బయటకు రావడం, చీఫ్ ఎలక్షన్ మీషనర్ తమ ఆమోదం లేకుండానే సర్ ప్రక్రియకు సంబంధించి 14 అంశాలలో ఏకపక్షంగా వ్యవహారించారని ప్రకటించిన స్థితిలో ఉద్యమం ఊపందు కుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిష నర్లను భారత రాష్ట్రపతి ఆర్టికల్ 324(2) కింద నియమి స్తారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఎన్నికల కమీషన్లకు ఒకే విధమైన అధికారాలు వున్నప్పటికీ భార్యభర్తలు ఇరు పురు సమానం కానీ భర్త కొంచెం ఎక్కువ అన్నట్టుగా కమి షనర్ల తొలగింపు విధానంలో చీఫ్ కమీషనర్‌కు మిగిలిన ఇరువురు సభ్యుల విషయంలో తేడా వుంది. రాజ్యాంగం ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమీషన్ ఏకపక్షంగా వ్యవహారించ డానికి చీఫ్ ఎలక్షన్ కమీషనర్ తొలగించడానికి ముందుగా చెప్పినట్టుగా ఇంపీచ్మెంట్ విధానం పాటించాల్సి వున్నప్ప టికీ మిగిలిన ఇరువురు కమీషనర్లను తొలగించడానికి ఇంపీచ్మెంట్ విధానం అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్‌లోని సభ్యుల ప్రవర్తన తీరు అనుమానస్పదంగా వుందని, అందు వల్ల వారిని విధుల నుంచి తొలగించాలని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే కేంద్రప్రభుత్వం లేదా రాష్ట్రపతి తొలగించవచ్చు. బహుశా ఈ కారణంగానే చీఫ్ ఎన్నికల కమీషనర్ సర్ ప్రక్రియను ఏకపక్షంగా నిర్ణ యాలు తీసుకున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.
నిబంధనలు మార్పు చేసినప్పుడే అభ్యంతరం చెప్పి వుంటే..
అయితే ప్రారం భంలో ఎలక్షన్ కమీషనర్ల నియామకాలకు సంబంధించిన విధివిధానాలు నిర్ణయించని నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో సుప్రీమ్ కోర్టు కల్పించుకొని ఎన్నిల సంఘం సభ్యుల నియామక విధివిధానాలు రూపొందించే వరకు ఎన్నికల సంఘం సభ్యులను ప్రధాన మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీమ్ కోర్టుప్రధాన న్యాయ మూర్తితో కూడిన కొలీజియంతో ఎన్నికల కమీషనర్లను నియమించాలని సూచించింది. 2023వ సంవత్సరంవరకు ఇదే విధానం కొనసాగింది. అయితే 2023వ సంవత్సరం లో ఎన్నికల సంఘం కమిషన్ల నియమాకాలకు సంబంధిం చి పార్లమెంటులో చట్టం చేశారు. పార్లమెంటులో చేసిన ఈ చట్టం ప్రకారం ఎన్నికలసంఘం సభ్యులను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడుతోపాటు కేంద్ర కేబినెట్లోని సీనియర్ మంత్రితో కూడిన కొలీజియం ఎంపిక చేస్తుంది. ఈ కొలీజి యంలో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో కేంద్ర కేబినెట్లోని సీనియర్ మంత్రిని సభ్యు నిగా తీసుకోవడం వల్ల కేంద్రంలో అధికారంలో రాజకీయ పార్టీకి అనుకూలమైన వారి నియమించే అవకాశం ఏర్పడిం ది. చీఫ్ ఎలక్షన్ కమీషన్ నియామకం సందర్భంగా నిబం ధనలు మార్పు చేసినప్పుడే అభ్యంతరం చెప్పి వుంటే ప్రస్తు తం ఈ పరిస్థితి దాపురించేది కాదు. సర్ (స్పెష ల్ ఇంటె న్సీన్ రివిజన్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆధారా లతో రుజువులు చూపిస్తున్నప్పటికీ ఉద్యమకారులు ఆయన తొలగించాలని డిమాండ్ చేయలేకపోతున్నారు.

సర్ ప్రక్రియకు 200 కోట్ల రూపాయలు
ఇదిలాఉండ గా సర్ ప్రక్రియ పేరిట పెద్దఎత్తున నిధులు ఖర్చుచేశారు. సర్ ప్రక్రియకు ఎన్ని నిధులు కేటాయించారనే సమాచారం అందుబాటులో లేకపోయినా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రియకు 200 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల సంఘం ప్రకారం ఇప్పటివరకు 20 రాష్ట్రాలలో సర్ పక్రియ ముగింది. ఈ ప్రకారం దేశం లోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయో అంచనా వేయ వచ్చు. ప్రస్తుత ఆందోళన నేపథ్యంలో సర్ప్రకియ రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినట్టే అవుతుంది. నిజానికి ఎన్నికల సంఘం చెబుతున్నట్టుగా మృతిచెందిన వ్యక్తుల ఓట్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లిన వారి ఓట్లు, ఒకే వ్యక్తి ఒకటికాకుండా వేరువేరు ప్రాంతాలలో కలిగివున్న ఓట్లు తొలగించాలంటే సరిచూసుకోవాల్సిన సర్ అవసరం లేకుండానే డోర్ టు డోర్ వరిశీలనతోపాటు ఏఐ సాంకేతి కను వినియోగించి తొలగించవచ్చు. ఇందుకు విరుద్ధంగా తాతలు, తండ్రులతో ముడిపెట్టడటం వల్ల అక్రమాలు జరి గాయనే భావన కలిగింది. ఒక్కొకటి వెలుగులోకి వస్తున్న అంశాలను గమనిస్తుంటే ఆ భావన నిజం కూడా కావచ్చు అనిపిస్తోంది. అంతేకాకుండా ఫారమ్ 6 లో అనవసరమైన రెండు అంశాలు వున్నాయని వాటిని తొలగిస్తున్నట్టు స్వయంగా చీఫ్ ఎన్నికల కమీషన్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. |
-అన్నవరపు బ్రహ్మయ్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: