Cash : డిజిటల్ విప్లవంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో, నగదు చలామణి ఐదేళ్లగరిష్ట స్థాయికి చేరడం పురికొలుపుతున్న అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ‘డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ క్యాష్ అవసరం తగ్గుతుంది’ అనే ప్రాథమిక ఆర్ధిక అంచనాను మన దేశ మార్కెట్ పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి. భారతీయ ఆర్ధికవ్యవస్థలో ప్రజల వద్దచలా మణిలో ఉన్న నగదు గణనీయంగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈనెల 15వ తేదీ నాటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదువిలువ ఏకంగా రూ.43.46లక్షల కోట్లకు చేరినట్లు స్పష్టంచేసిం ది. గతఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది13.5శాతం పెరుగుదలకాగా, గత ఐదేళ్లకాలంలో నమోదైన అత్యధిక వృద్ధి రేటు కావడం గమనార్హం. అలాగే దేశంలో రిజర్వ్ మనీ కూడా 10.3శాతం వార్షిక వృద్ధితో రూ.53.24 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్బీఐ గణాంకాలుతెలిపాయి. చలామణిలో ఉన్న నగదు వృద్ధి రేటు 13.3 శాతంగా నమోదవ్వడం వ్యవస్థలో పెరుగుతున్న నగదు వినియో గానికి నిదర్శనంగా నిలిచింది. కరెన్సీ చలామణి ఈ స్థాయిలో పెరగడానికి రూపాయి పతనాన్ని అడ్డుకునే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫారిన్ కరెన్సీ నాక్రెసిడెంట్ డిపాజిట్ పథకం కూడా ఒక ప్రధాన కారణమని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పథకం కింద బ్యాంకులు రూపీ రక్షణ చర్యల్లో భాగంగా ఆగస్టు 31 నాటికి 133 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. దీనికి తోడు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూ.8.8లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి నిధులను విపణిలోకి వదిలింది.
Read Also : Signathon Awareness Run: సైనాథాన్ 3.0.. ఆశ్రయ్ ఆకృతి ఆధ్వర్యంలో 2,500 మందితో భారీ అవగాహన రన్

Cash : ద్రవ్య లభ్యతను నిరంతరం పెంచడం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోనూ డాలర్ పాయిస్వాప్ సదు పాయాల ద్వారా వ్యవ స్థలో ద్రవ్య లభ్యతను నిరంతరం పెంచింది. ప్రస్తుతం లభ్యతలో ఉన్న అదనపు ద్రవ్య లభ్యతను ఉపసంహరిం చుకునే చర్యలను ఆర్బీఐ ప్రారంభించింది. రాబోయే పండుగల సీజన్లో ప్రజల నగదు వినియోగం మరింత పెరగడం, విదేశీ మారకపు మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మరిం త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా మున్ముందు వృద్ధిరేటు మందగించే అవకాశ ముంది. మరోవైపు, భారత్ ఇంధనాన్ని అధికంగా దిగు మతి చేసుకుంటున్నప్పటికీ, దేశీయ వినియోగం, సేవల రంగం ఎంతో బలంగా ఉండటం వల్ల అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభ పరిణామాలను మన దేశం సమర్థవంతం గా తట్టుకోగలుగుతోందని ఆర్బీఐ ఉవాచ. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో, నిత్యావసరాల ధరల నియంత్రణకు మరింత కఠినమైన ద్రవ్య విధాన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థికవ్యవస్థలోగణనీయ మైన భాగంఇంకా అనధికారిక పరిధిలోనే ఉంది. గ్రామీణ ప్రాంతాలు, స్థానిక కూరగాయల మార్కెట్లు, చిన్నకిరాణా కొట్టు యజమానులు, రోజువారీ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఇప్పటికీ నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తారు. యూపిఐ ఛార్జీల భయం, పన్నుల పరిధిలోకి వస్తామనే సందేహాలు లేదా నెట్వర్క్ సమస్యల కారణం గా చిన్న వ్యాపారులు నగదునే నమ్ముకుంటున్నారు.
ప్లాస్టిక్ నోట్ల’ యోచన
ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రజలు డిజిటల్ చెల్లింపుల ను వేగవంతమైన సాధనంగా వాడుతున్నప్పటికీ, ఆకస్మిక సాంకేతిక లోపాలు లేదా బ్యాంకింగ్ సర్వర్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు వడకుండా ఉండటానికి ముం దస్తు రక్షణగా తగినంత నగదును చేతిలో ఉంచుకొన్న సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా రూ.100, రూ.200, రూ.500 నోట్లను ఇళ్లలో ఎక్కువగా ఉంచుకోవడానికి ఇది ఒక కారణం. రిజర్వ్ బ్యాంకుపై కరెన్సీ నిర్వహణ భారం బాగా ఎక్కువే. కరెన్సీ నోట్ల చలామణి అధికమవడం వల్ల ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను కొత్త నోట్ల ముద్రణ, రవాణా, పాత నోట్ల రద్దు కోసం ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తోంది. అందుకే రిజర్వ్ బ్యాంకు దీర్ఘకా లిక పరిష్కారంగా ‘పాలిమర్/ప్లాస్టిక్ నోట్ల’ యోచనలో ఉంది. అందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టింది. ఆర్ధిక వ్యవస్థ పరిమాణం పెరిగే కొద్దీ, మార్కెట్లో జరిగే మొత్తం లావాదేవీల సంఖ్య కూడా పెరుగుతుంది. జిడిపి వృద్ధి చెందినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుం ది.

నగదు వైపే ప్రోత్సహించడం
డిజిటల్ శాతం పెరిగినప్పటికీ, స్థూలసంఖ్య దృష్ట్యా నగదు అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. రూ.2000నోట్లను రిజర్వ్ బ్యాంకు వెనక్కి తీసుకున్న తర్వా త, ఆ స్థానాన్ని రూ.500నోట్లు ప్రధానంగా ఆక్రమిం చాయి. మొత్తం కరెన్సీ విలువలో రూ.500నోట్ల వాటా 85 శాతం పైగా పెరిగింది. దాంతోపాటు ఏటీఎంలద్వారా లా వాదేవీల సౌలభ్యం, నగదు రూపంలో పొదుపు చేసు కునే సాంప్రదాయ అలవాటు ప్రజల్లోకొనసాగుతుండటం కూడా దీనికి కారణం. చిన్నచిన్న కొనుగోళ్లకు డిజిటల్ క్యూఆర్ కోడ్లను వాడుతూనే, అత్యవసర సమయాలు, ప్రయాణాలు లేదా స్థానిక చెల్లింపులకు నగదును ప్రత్యా మ్నాయ రక్షణగా వాడుతున్నారు. రిటైల్ స్థాయిలో కొంత మంది వ్యాపారులు డిజిటల్ రికార్డుల్లో చూపిస్తేజీఎస్ టి, ఇన్కమ్ టాక్స్ వర్తిస్తుందనే ఉద్దేశంతో కొనుగోలుదారుల ను నగదు వైపే ప్రోత్సహించడం కూడా ఒక అంతర్లీన కారణం. భారత ఆర్ధికవ్యవస్థలో అనధికారిక లావాదేవీ లు, నగదు వినియోగం పెరగడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పని సరి అవుతోంది. డిజిటల్ లావాదేవీలపై మౌలిక వసతులు మరింత పటిష్టం చేసి, గ్రామీణ స్థాయిలో డిజిటల్ అక్షరాస్యతను విస్తరిస్తే తప్ప నగదు చలామణి అనుకున్న స్థాయిలో తగ్గకపోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: