carelessness : నిర్లక్ష్యానికి పరాకాష్ట!

Follow Us: Google News Daily Hunt
carelessness
carelessness
FONT SIZE
GET APP

carelessness : దేశ రాజధాని ఢిల్లీలో మెడికల్ టూరిజానికి ఏమాత్రం భద్రత ఉండదని అనుమానించే దుర్ఘటనకు బుధవారం రాజధానిలో జరిగిన అగ్నిప్రమాదం 21 మంది ప్రాణాలను బలితీసుకోవడం సాక్షీభూతమైంది. ‘అభివృద్ధి, సాం కేతిక పురోగతి గురించి గర్వంగా మాట్లాడుకునే సమా జంలో ఇప్పటికీ ప్రాథమిక భద్రతా ప్రమాణాల నిర్లక్ష్య మే ఇలాంటి దుర్ఘటనలకు కారణమవడం విచారకరం. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోని ‘ఫ్లోరిష్ స్టే’ అనే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో బుధవారం ఉదయం 8:50 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లోని ‘లెమన్ గ్రీనెస్టారెంట్ నుంచి మొద లైన మంటలు ఆరు అంతస్తులకు వ్యాపించాయి. ఎంతో మంది ప్రాణాలు సజీవ దహనమయ్యాయి. వారిలో ఎక్కువ మంది వైద్య సేవలు కోసం భారత్కు వచ్చిన విదేశీ అశ్రితులే. తీవ్రమైన మంటల మధ్యన భయంతో పైఅంతస్తు నుంచి కిందకు దూకుతున్న వీడియోలు అందరికీ ఎంతో హృదయ విదారకంగా అనిపించాయి. వారిని ఏ విధంగానూ రక్షించలేని పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షులు కూడా విలవిల్లాడిపోయారు. ప్రమాద సమయంలో లాడ్జిలో ఉన్న వారంతా గాఢనిద్రలో మునిగి ఉన్నందున మృత్యువునుంచి తప్పించుకోలేకపోయారు. ఈ ఘటనలో అనేక మంది పొగతో ఉక్కిరిబిక్కిరై మర ణించగా, కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికిభవనం పై అంతస్తుల నుంచి దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : Two fire accidents in Noida : నోయిడాలో రెండు అగ్నిప్రమాదాలు..తప్పిన ప్రాణనష్టం

carelessness
carelessness

carelessness : ఒక్క దారీ సరైనదిలేకపోవడం

అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు ఒక్క దారీ సరైనదిలేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గమే ఏర్పాటులో లేకపోవడం, భవన యజమానులు భద్రతా నిబంధన లను పాటించకపోవడం, నిరంతర తనిఖీలలో లోపాలు ఉండటం వంటి అంశాలు ఈ విషాదానికి ప్రధాన కార ణాలుగా కనిపిస్తున్నాయి. భవనానికి ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు. ఇన్ హౌస్ ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ లేదు. పై అంతస్తులకు ఒకేదారిలో సాధారణ మెట్లు నిర్మితం, ఒకే ప్రవేశ నిష్క్రమణ ద్వారం మాత్రమే. ప్రాథమిక నివేదికల ప్రకారం భవనంలో సరైన అగ్నిమాపకభద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ఒకే ప్రవేశ నిషమణ మార్గం ఉండటం వంటి అంశాలు ప్రాణనష్టాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో భవనంలో అగ్ని మాపక భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేవని వెల్లడైంది. మృతుల్లో బంగ్లాదేశ్, నైజీరియా, మొజాంబిక్, లైబీరియా, తుర్క్ మెనిస్తాన్ వాసులు ఉన్నారు. వారు దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స కోసం ఉండేవారు. అంటే ఈ ప్రాంతం ‘మెడికల్ టూరిజం’ కోసం వచ్చేవారికి ఆశ్ర యం కల్పిస్తోందన్న జిజ్ఞాసఉంది. కానీ అక్కడ భద్రత శూన్యమనీ, అక్రమ నిర్మాణాలకు ఆశ్రయం ఇచ్చేవ్యవస్థలో మార్పురాకపోతే, మాలవియా నగర్లో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవనే గ్యారంటీ ఏమీ లేదు. విచిత్రమే మిటంటే ఆ భవనానికి అగ్ని నుండి భద్రత కలిగించే ఒక్క జాగ్రత్త కూడా తీసుకోలేదు.

తిలాపాపం తలా పిడికెడు

మరి ఏలినవారు ఏమి చేస్తున్నారో. తిలాపాపం తలో పిడికెడు అన్నట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారి భాగస్వామ్యమూ ఈ హోటల్ అనుమతులలో నిర్లక్ష్యం ఉంది. ఆ హోటల్లో 20 గదులున్నాయి. కానీ కేవలం 6 గదులకు మాత్రమే అనుమతులున్నాయి. భవనయజమాని లోకేష్ బజాజ్ని అరెస్ట్ చేశారు. ఎంతోమంది బలైపోయిన ఒక సంఘట నలో భవన యజమానిని అరెస్ట్లో పోలీసుశాఖ, బాధ్యు లైన ఇతర అధికారుల బాధ్యతతీరుతుందా.? ఇలాంటి ప్రమాదాల్లో ఒక అరెస్ట్ చేసేసి పోలీసులు చేతులు దులుపుకుంటారని మనకు తెలిసిందే. ఢిల్లీ అగ్నిప్రమాదం కేవ లం ఒక ప్రమాదం కాదు, ఇది భద్రతా వ్యవస్థల్లో ఉన్న లోపాలపై ఒక హెచ్చరిక. పోయినప్రాణాలు తిరిగిరావు. అయితే వారి మరణాలు అధికారిక సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, భద్రతపై రాజీ పడిన ప్రతి చోట మరో విషాదం పొంచి ఉందని ఈ ఘటన ప్రభుత్వాలకు గుర్తుచేస్తోంది. అగ్నిమాపకభద్రత నిబంధనలు ఉల్లంఘించే అన్ని గెస్ట్ హౌస్లు, హోటళ్లను సీల్ చేయాలి. బాధ్యులపై ఢిల్లీ ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అన్నివాణిజ్య భవనాలకు ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయాలి. సర్టిఫికేట్ లేకపోతే కరెంట్ కట్, లైసెన్స్ రద్దు. అంతస్తుల పైన ఉన్న ప్రతి భవనానికి కనీసం 2వైపులా మెట్లు, ఫైర్ ఎస్కేప్తప్ప నిసరి చేయాలి. లేకపోతే అనుమతినీయకుండా నిబంధాల ను రూపొందించుకోవాలి.

carelessness
carelessness

నిబంధనలు కాగితాలకే

ఫైర్ ఆఫీసర్ అనుమతిలేకుండా హోటల్ నడిపితే యజమానితో పాటు సంబంధిత అధికారిని కూడా బాధ్యులను చేయాలి. ఢిల్లీ టూరిజం, ఆస్ప త్రులు విదేశీ రోగులకు భద్రత చెల్లిస్ట్ ఇవ్వాలి. అన్ని గెస్ట్ హౌస్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్, స్మోక్ డిటెక్టర్ తప్పనిసరి. నానో సెన్సార్ల ద్వారా రియల్టైమ్ మానిట రింగ్. షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ లోపాలు అనేక అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నందున నిరంతర తనిఖీలు అవసరం. భవనం భద్రతా నిబంధనలు పాటించకపోతే, అవి ముందుగానే గుర్తించాల్సిన బాధ్యత తనిఖీ అధికారులపై కూడా ఉంటుంది. ఫైర్ సేఫ్టీ తనిఖీలు క్రమం తప్పకుండా జరిగి ఉంటే ప్రమాదం తీవ్రత తగ్గే అవకాశం ఉండేది. దేశంలో అనేకప్రాంతాల్లో భవననియమాలు, అగ్నిమాపక నిబంధనలు కాగితాలకే పరిమితమవుతు న్నాయనే విమర్శలు తరచుగా వినిపిస్తుంటాయి. ఈ ఘటన కూడా అమలు లోపాలను బహిర్గతం చేసింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో భద్రతా తనిఖీలను తప్పనిసరి చేయడం కూడా అత్యవసరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు