Cancer : శంఖంలో పోస్తే తప్ప గంగాజలం తీర్థం కాబోదు. ఇదో సిద్ధాంతం, రాజపుండులా మానవ జీవాలను పీల్చిపిప్పి చేస్తున్న కేన్సర్‌ను నోటిఫై చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే దానికి నిదర్శనం. కేన్సర్ లక్షణాలు కనిపించగానే ఒక్క క్షణం కూడా బాప్యం చేయ కుండా వైద్యానికి చేరువయితేనే ఆ ప్రాణం నిలబడుతుంది. లేకుంటే అదీ ఒకటి, రెండు దశలు దాటాక ఆసుపత్రికెళ్లి నా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దశలు మారే కొద్దీ ప్రాణాంతకమని, ఇక సాధారణ పరిస్థితికి రాలేమని కేన్సర్ వ్యాధి చికిత్స నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ వైద్యానికి ఖర్చుపెట్టుకునే ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది చచ్చే చావు వచ్చేవరకు మంచాన్ని వదిలిపెట్టి కదలరు. ఏనాటికైనా పోవాల్సిందే కదా! అని సరిపెట్టుకోవడం కద్దు. కేన్సర్ కూడా నయమవుతుందన్న భరోసా కల్గిస్తున్న నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉన్నా దానిగుర్తింపు వైద్య చికి త్సల కోసం ఖర్చు పెట్టేందుకు ఎంతో మందికి స్తోమత ఉండటం లేదు. అందుకే కేన్సర్‌ను నయం చేయగలిగిన వ్యాధిగా డాక్టర్లు చెప్పినా కూడా వైద్య ఖర్చులకు తట్టుకో లేక తాము జీవిత చరమాంకంలో ఉ న్నామనిచెప్పుకుంటూ బతికేస్తున్నారు. స్తోమత ఉన్నవారు మంచి ఖరీదైన వైద్యం చేయించుకుని ఎంచక్కా ఆరోగ్యంతో తిరగ్గలుగుతున్నారు. మరి ఏదారీ దిక్కుతోచని వారే తమ అంతిమ యాత్ర కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
Read Also : White Tea : వైట్ టీ ఎలా తయారవుతుంది? ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది?

Cancer : నోటిఫైడ్ వ్యాధి’గా కేన్సర్
కేన్సర్ పీడిత రోగులను వారి ఖర్మకు వారిని వదిలేసేందుకు ఎవరూ సిద్ధంగాలేరు. కొన్ని విధాన నిర్ణయాల విషయంలో కేన్సర్ కనికట్టు? ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందంటూకొందరు బాధితులుసుప్రీం కోర్టు మెట్లెక్కారు. ఉన్నత ధర్మాసనం నుంచి తగు మార్గ దర్శకాలు వెలువడ్డాయి. కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించేందుకు వీలుగా ఆ వ్యాధిని నోటిపై యబుల్ డిసీజ్‌గా ప్రకటించాలని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశించింది. పార్లమెంటు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులను 17 రాష్ట్రాలు అమలు చేసి నోటిఫైడ్ వ్యాధి’గా కేన్సర్ ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేన్సర్ వ్యాధి చికిత్సలో ఒకే రకమైన విధానాన్ని అమలు చేయా లని సుప్రీం మార్గదర్శకాలు జారీ అవసరమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీ, జస్టిస్ వి. మోహన్ల త్రిసభ్య ధర్మాననం అభిప్రాయపడింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేన్సర్ మహమ్మారిని అణచివేయడంలో రోగులకు సకాలం లో మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ వ్యాధిని దేశ మంతటా అన్ని రాష్ట్రాలు నోటిఫై చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం సుప్రీం త్రిసభ్య ధర్మాసనం జోక్యంతో ఆ వ్యాధికి దేశమంతటా ఒకే రకమైన ఆరోగ్య విధానం ఉండే లా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రముఖ వైద్యులు అనురాగ్ శ్రీవాస్తవ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మా సనం ఇచ్చిన ఆదేశాలు అత్యంత కీలకమైనవిగానే చెప్పాలి. ఈ ఆదేశాలు అమలైతే ఇప్పటికే ఉన్న రాష్ట్రాలతోపాటు మరో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏక రూప వైద్య చికిత్సలకు లోబడి కేన్సర్ రోగుల వైద్యంలో తరిస్తాయి.
అవగాహన లేమి
నిజానికి దేశంలో కేన్సర్‌కు సంబంధించినడేటా కొరత ఉంది. కోర్టు ఆదేశాలు అమలై కేన్సర్‌ను ‘నోటిఫై యబుల్ వ్యాధి’గా నిర్ధారిస్తే దేశంలోని ప్రతి ఆసుపత్రి, వైద్యుడు వాటి డేటాను ప్రభుత్వానికి అందించాల్సి ఉం టుంది. వ్యాధి తీవ్రత, విస్తృతిని బట్టి ప్రభుత్వం నివారణ చర్యలకు ఆరోగ్య ప్రణాళిక సిద్ధం చేసేందుకు అవకాశముం టుంది. భారత రాజా ్యంగంలోని అధికరణ 14కిందనోటిఫై చేయబడిన రుగ్మతలకే ఆరోగ్య సంరక్షణ ఉంటుంది. నోటిఫై చేయడమనేది కొన్ని రాష్ట్రా లకే పరిమితమైతే మిగిలిన రాష్ట్రాలలో కేన్సర్ రోగులకు ప్రభుత్వపరంగా వైద్యభరోసా ఉండదు. కేన్సర్పైజాతీయ స్థాయి డిజిటల్ రిజిస్ట్రీఏర్పాటు కావాలని పిటీషనర్ కోరుతున్నారు. వ్యాధి ముదిరిన తర్వా త ఖరీదైన చికిత్సల కోసం వెంపర్లాడడం కన్నా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ఇలా ఒకే ఒక లక్ష్యంతో ఫిర్యాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదొక దేశ ప్రజారోగ్యానికి సంబంధించిన ఒక దిశానిర్దేశంగా చెప్పుకోవాలి. ఆరోగ్య రక్షణ వ్యవస్థకు ఇదొక పటిష్టమైన పునాదిగా చూడాలి. దేశవ్యాప్తంగా జాతీయ కేన్సర్నియం త్రణ విధానాన్ని రూ పొందించేందుకు మార్గదర్శనం ఏర్ప డ్తుంది. ప్రజలను సరైన అవగాహన లేమితో గోమూత్రం వంటి శాస్త్రీయ ఆధారాలు లేని ప్రత్యామ్నాయ చికిత్సల నుండి కాపాడిన ట్లవుతుంది. కేన్సర్ అంటువ్యాధి కాదు నయమౌతుందన్న నినాదమే కేన్సర్ రోగిని సగం బతికి స్తుంది. అదే కేన్సర్ వ్యాధి నియంత్రణకు దారులు తెరిచే ఉంటే ఆ రోగి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడే వీలుంది.

ప్రభుత్వ భీమా పథకాలతో అనుసంధానించబడిన
కేన్సర్ నియంత్రణకు అవసరమైన వైద్యనిర్మాణసౌకర్యాలు, స్క్రీనింగ్ కేంద్రాలు, రేడియో థెరపి, ఖీమో థెరపీ, ఆంకా లజీ స్పెషలిస్టులు పాలియేటిక్ కేర్ అందుబాటులోకి రాగ లవు. కేన్సర్ వ్యాధిలో తెలుగు రాష్ట్రాలో పేరొందిన వైద్య చికిత్సలున్నందున అధునాతన స్కానింగ్ సౌకర్యాల కార ణంగా వాళ్లు సరైన చికిత్సల ద్వారా స్వస్థతనొందుతారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, ఊపిరితిత్తులు కేన్సర్ వంటి వాటికి అధునాతన వైద్యం లభిస్తుంది. అనేక రాష్ట్రాలలో అవగామన లేమి కారణంగా వ్యాధి ముదిరిన తర్వాతనే వైద్యం మొదలైన కారణంగా ఎంతో కాలం రోగి బతికేందు కు చాన్సులు బహుతక్కువని పిటీషనర్ పేర్కొ న్నారు. వైద్యానికి లొంగదని ఇన్నాల్లూ చెప్పుకుంటూ వస్తున్న కేన్సర్‌కు ఒక ‘టీకా’ దొరికిందన్న వార్త ఎంతో శుభదాయకం. కానీ అది ఏదశలో వాడాలి. ఎలా వాడాలి అన్న అంశాలపై స్పష్టమైన వైద్య అవగాహన లభ్య మైన రోజుల్లో ఆసుపత్రి డేటా బేస్‌లు ప్రభుత్వ భీమా పథకా లతో అనుసంధా నించబడిన డేటాలేనిదే కేన్సర్ చికిత్స సాధ్యంకాని పరిస్థితి ఉంది. ఇవన్నీ వద్దతిగా జరిగితే కేన్సర్ రోగుల సంఖ్య నానాటికీ తగ్గుముఖాన్ని పట్టనుండటం శుభ పరిణామం కాగలదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: