Banakacharla Project : బనకచర్ల పేరుతో విభేదాలు అవసరమా?

Follow Us: Google News Daily Hunt
Banakacharla Project
Banakacharla Project
FONT SIZE
GET APP

Banakacharla Project : బనకచర్ల జలాశయ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనవసరమైన రాజకీయ చర్చ కు దారితీస్తోంది. నిజానికి ఈ ప్రాజె క్టుకు ప్రత్యక్షంగా గోదావరి నదికి, తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఒక సాగు నీరు తాగునీరుకు సంబంధించినది. గోదావరికి వరదలు వచ్చే సమయం లోవృధాగా సముద్రంలో కలిసిపోయే నీళ్లను ఒడిసి పట్టుకొనే పథకం పోలవరం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం కూడా అంగీ కరించింది. ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణానది ద్వారా కరవు పీడిత రాయలసీమ ప్రాంతాన్ని సారవంతమైన భూమిగా మార్చేందుకు రూపొందించిన పథకం ఈ బనక చర్ల జలాశయ ప్రాజెక్టు, అయితే బనకచర్ల ప్రాజెక్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ నేత మాజీమంత్రి హరీష్ రావు ు వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్ట్ అనేది వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిని పట్టుకొనే పథకం మాత్రమేనని దీనికి తెలంగాణ రాష్ట్రానికి ఎటువుంటి నం బంధం లేదని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటి శాఖామాత్యులు నారా లోకేష్ వివరించారు.

Read Also : PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన వేళ గిఫ్ట్.. మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!

Banakacharla Project
Banakacharla Project

Banakacharla Project : నీరు వృథాగా సముద్రంలో కలసిపోయింది

తెలంగాణ పరిధిలో గోదావరి నదిపై ఎన్ని పథకాలు కట్టుకున్న మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే బనకచర్ల వృథాగాపోయే వరద నీటినిమాత్రమే ఒడిసి పట్టుకుంటుందని మంత్రి లోకేష్ ఇచ్చిన వివరణపై ఆలోచించాలి. అందుబాటులో వున్న సమాచారం ప్రకారం 2016 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 28,500 టిఎంసిల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలసిపోయింది. ఒక్క 2024 సంవత్సరం లోనే 2,828టి. ఎం.సి. నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో వృథాగా పోయేనీటిని ఒడిసి పట్టేందుకు రూపొందించినదే పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ గోదావరి నీటిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వద్ద వున్న ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో కలుపుతారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి జలాశయానికి అక్కడ నుండి నంద్యాల జిల్లా బసకచర్ల జలాశయానికి వలు ఎత్తిపోతల కేంద్రాలు, సొరంగాల ద్వారా నీటిని తరలిస్తారు. బనకచర్లలో నిర్మించే జలాశయం సామర్థం 20వేల క్యూసెక్కు బనకచర్ల జలాశ యం నుంచి ప్రవహించే నీరు శ్రీశైలం కుడికాల్వకు ఇదిఅను సంధానం అవుతుంది.

వృథా నీటిని ఉపయోగించుకో వచ్చుననే ఉద్దేశ్యంతో

గోదావరికి వరదలు వచ్చి, ఆ నీరు కృష్ణానది ద్వారా బనకచర్లకు నీరు వస్తే రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలో అదనంగా దాదాపు 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు లభించడమే కాకుండా 20లక్షల మం దికి దాహార్తి తీర్చుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలం గాణకు ఏ మాత్రం సంబంధంలేదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కేవలం వరదల కారణంగా వృథాగా సముద్రంలో కలసి పోయే నీటిని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నది. ఈ నేపథ్యంలో గోదావరికి వరదలు రానిపక్షంలో ఈ పథకం వల్ల ఎటువంటి ప్రయోజనం వుండదు. ఈ విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవగాహన వున్నప్పటికీ ఎప్పుడు వరదలు వస్తే అప్పుడే వృథా నీటిని ఉపయోగించుకో వచ్చుననే ఉద్దేశ్యంతో బనకచర్లను రూపొందిస్తోంది. దీనిని బట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లాభనష్టాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికే చెందుతాయి. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్త యితే రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా పట్టు పెరుగుతుంది. సాఫ్ట్వేర్ వంటి అంశాలలోనే కాకుండా చంద్రబాబు నాయుడుకు నీటిపారుదల పథకాల పట్ల కూడా ముందుచూపు వుందని, అందుకు నిదర్శనమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Banakacharla Project
Banakacharla Project

నికర జలాలతో ఈ పథకానికి సంబంధమే లేదు

పోలవరంకు అనుసంధానంగా 2016న సంవత్సరంలో ప్రారంభమైన పట్టిసీమ ప్రాజెక్ట్ ఖర్చుచేసింది. 1660 కోట్ల రూపాయలు. ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటినుంచి నేటివరకు 442 టిఎంసిల నీరు కృష్ణాడెల్టాకు అందింది. దీంతో రైతులు 10 వేల కోట్ల రూపాయల విలువైనపంటలు పండించుకోగలిగారు. ఎల్స్నె నేపథ్యంతో వర్షాలు పడని స్థితిలో కూడా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు. పట్టిసీమ తరహాలోనే వృథా గా సముద్రంలో కలిసే నీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పథ కాన్ని చంద్రబాబు నాయుడు రూపొందించారు. నికర జలాలతో ఈ పథకానికి సంబంధమే లేదు. ఈస్థితిలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నష్టంగానీ, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించే అంశం ఏమిటో అర్ధం కావ డం లేదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టురు కృష్ణానదీ నిర్వ హణ బోర్డు, గోదావరి నది నిర్వహణ బోర్డుల నుంచి అవ సరమైన అనుమతులు లభించలేదని తెలంగాణ నేతలు పేర్కొంటున్నారు. నికర జలాలు వాడుకొనేటప్పుడు లేదా వాటా అడుగుతున్నప్పుడు అనుమతులు అవసరమవుతాయి. శాస్త్రస్త్రీయంగా, పాలనాపరంగా ఎటువంటి ఇబ్బంది లేక పోయినా బనకచర్ల పేరుతో మరోసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం భావ్యం కాదు.

-అన్నవరపు బ్రహ్మయ్య

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు