Artificial forests : కృత్రిమ వనాలే పర్యావరణ సంరక్షణకు మార్గం

Follow Us: Google News Daily Hunt
Artificial forests
Artificial forests
FONT SIZE
GET APP

Artificial forests : మన దేశం ప్రస్తుతం ఒక తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడు గంటిపోతున్నాయి. దేశంలో దాదాపు 96 మిలియన్ హెక్టార్ల భూమి అంటే మూడో వంతు భూభాగం వివిధ కారణాల వల్ల నిస్సారంగా మారి చవిటి నేలలుగా మారు తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి, ఊపిరాడని కాలుష్యం ముంచుకొస్తాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ మొత్తం భూ భాగంలో 33శాతం అడవులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం అది కేవలం 21.73 శాతానికే పరిమితమైంది. మనం నిర్దేశిత లక్ష్యం కంటే చాలా వెనుకబడి ఉన్నాం. తగినంత విస్తీర్ణంలో అడవులు లేక పోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. దీనికి తక్షణ విరుగుడుగా ఆధునిక సాంకేతికతను మానవ ప్రయత్నాన్ని జోడించి, యుద్ధప్రాతిపదికన ‘కృత్రిమ వనాలను’ సృష్టించడం ఒక్కటే మన ముందున్న ఆచరణా త్మక మార్గం. మొక్కల పెంపకానికి, వనాల సృష్టికి మధ్య ఉన్న వ్యూ హాత్మక వ్యత్యాసాన్ని గమనించాలి. ఇళ్ల ముందు, రోడ్ల పక్కన మొక్కలు నాటడం అనేది ఒక వ్యక్తిగత అల వాటు మాత్రమే. కానీ కృత్రిమ వనం అంటే ఒక నిర్దిష్ట ప్రణాళికతో సహజ పద్ధతిలో ఒక స్వయంసమృద్ధ అడవిని నిర్మించడం. ఇందులో కేవలం చెట్లు మాత్రమే ఉండవు.

Read Also : Ram Mandir: ఆలయ విరాళాల వివాదంపై అత్యవసర విచారణను నిరాకరించిన సుప్రీంకోర్టు

Artificial forests
Artificial forests

Artificial forests : నేల స్వభావానికి సరిపోయే విభిన్న రకాల దేశీయ వృక్షాల

స్థానిక నేల స్వభావానికి సరిపోయే విభిన్న రకాల దేశీయ వృక్షాలను ఎంపిక చేస్తారు. అవి ఒకదానికొకటి తోడ్పడు తూ పెరిగేలా దట్టంగా నాటుతారు. కొద్ది కాలంలోనే ఇది పక్షులు, కీటకాలు, చిన్న జీవులకు నిలయంగా మారి, ఒక సహజ అడవిలా రూపాంతరం చెందుతుంది. చైనా హరిత ప్రాజెక్ట్ ద్వారా 35 మిలియన్ హెక్టార్ల ఎడారి భూమిని పచ్చని వనాలుగా మార్చింది. జపాన్, ఆఫ్రికా వంటి దేశాలు కూడా ఇదే వ్యూహంతో అద్భుతమైన విజయాలు సాధించా యి. మరి ఇంతటి సాంకేతికత అపారమైన మానవ వన రులు ఉన్న మన దేశం ఈ తరహా భారీ కృత్రిమ వనాల నిర్మాణంలో ఎందుకు ఆశించిన ఫలితాలను సాధించలేకపో తోందో అంతర్మథనం చేసుకోవాలి. మన దేశంలో పర్యా వరణ స్పృహ లేకపోవడం సమస్య కాదు. చేస్తున్న ప్రయ త్నాల్లో దీర్ఘకాలిక ప్రణాళిక లోపించడమే అసలు సమస్య. ఏటా వర్షాకాలంలో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నా అందులో ఎన్ని చెట్లుగా మారుతున్నాయనే దానికి సరైన నిఘా లేదు. కేవలం కాగితాల మీద సంఖ్యలు చూపించే రొటీన్ కార్యక్రమాల వల్లే మనం అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన మార్పును తీసుకురాలేకపోతున్నాం.

వన్యప్రాణుల రక్షణ

ప్రస్తుతం ఉన్న అటవీ శాఖకు స్మగ్లింగ్ అడ్డుకోవడం, వన్యప్రాణుల రక్షణ వంటి ఎన్నోఇతర బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల, దేశవ్యాప్తంగా కృత్రిమ వనాలను అమలు చేయడానికి ‘ప్రత్యేక జాతీయ యంత్రాంగం’ ఒకదాన్ని ఏర్పాటు చేయా లి. దీనికి కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించడంతో పాటు, ప్రతి రాష్ట్రం తప్పకుండా ఇందులో భాగస్వామ్యం కావాలి. నిర్దేశిత కాలంలో లక్ష్యాలను అందుకోకపోతే సం బంధిత అధికారులు జ వాబుదారీ వహించేలా చట్టబద్ధమైన నిబంధనలు ఉండాలి. ఈ వ్యవస్థకు ‘కృత్రిమ వనాల అభివృద్ధి’ తప్ప మరో రెండవ లక్ష్యం ఉండకూడదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పర్యావరణ సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని ఒకేసారి దెబ్బతీ స్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఏటా రైతులు సగటున 20 నుండి 25శాతం వరకు పంట దిగుబడిని నష్టపోతు న్నారు. మరోవైపు కాలుష్యం వల్ల వచ్చే రోగాల కారణంగా సామాన్యుడి సంపాదనలో సగానికి పైగా వైద్య ఖర్చులకే హారతవుతోంది.

Artificial forests
Artificial forests

లక్ష లాది కొత్త ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతి ఏటా బడ్జెట్లో దాదాపు 90 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ప్రజారోగ్యం, వైద్యపథకాల కోస మే కేటాయించాల్సి వస్తోంది. ఈనష్టాలన్నింటినీ అధిగ మించడానికి కృత్రిమ వనాల ఏర్పాటు ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. ఈ వనాల సృష్టి కేవలం పర్యావర ణాన్ని కాపాడటమే కాదు, దేశ ఆర్థిక రంగానికి సరికొత్త ఊపును ఇస్తుంది. వేల ఎకరాల్లో అడవులను నిర్మించే క్రమంలో భూమిని సిద్ధం చేయడం, మొక్కల పెంపకం, నిర్వహణ వంటి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష లాది కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవి ష్యత్తులో ఈ వనాల ద్వారా లభించే కలప రహిత అటవీ ఉత్పత్తులు, ఔషధ మొక్కలు, తేనె వంటి వాటి ద్వారా స్థానిక పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా, గ్లోబల్ స్థాయిలో కార్బన్ క్రెడిట్స్ మార్కెట్ ద్వారా దేశానికి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఈ క్రమంలో ప్రజల పాత్ర అంటే కేవలం పెరట్లో మొక్క నాటడం కాదు. పౌర సమాజంగా, స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి ఈ వనాలను అసాంఘికశక్తులు, పశువుల బారి నుండి కాపాడే పర్యవేక్ష కులుగా బాధ్యత తీసుకోవాలి. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది పర్యావరణ నినాదాలు కాదు. పక్కా ప్రణాళి కతో కూడిన కృత్రిమ వనాల నిర్మాణం.

-కింజరాపు అమరావతి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు