సాయంత్రం 6 గంటలలోపు డిన్నర్ పూర్తి చేసే అలవాటు ఆరోగ్యానికి మంచిది(Good for health)అని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు శరీర రీతులను అనుసరించి మెరుగైన జీర్ణశక్తి,(Better digestion,) మంచి నిద్ర, శరీర బరువు నియంత్రణ (Weight control)వంటి లాభాలను అందిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

సినిమా హీరోయిన్లు, కొంతమంది సెలబ్రిటీలు సాయంత్రం 6 లోపే డిన్నర్ పూర్తి చేస్తారట. ఇలా త్వరగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వారే స్వయంగా వెల్లడించిన సందర్బాలు కూడా ఉన్నాయి.
నిపుణులు అభిప్రాయం ప్రకారం..
సాయంత్రం 6 లేదా 7 గంటలలోపు డిన్నర్ ముగించేవారు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటారని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే రాత్రి 6 గంటలలోపు రాత్రి భోజనం ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం 6 లోపు భోజనం చేయడం వల్ల పడుకునే లోపే ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. దీని వల్ల అజీర్తి, మలబద్దకం, ఉబ్బరం వంటి సమస్యలు రావు. బరువు తగ్గేందుకురాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. అదే లేటుగా తింటే కొవ్వు పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.
నిద్ర బాగా పడుతుంది
రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడదు. దీని వల్ల శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. షుగర్ కంట్రోల్సాయంత్రం పూట త్వరగా డిన్నర్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంరాత్రిపూట తొందరగా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది. లేటుగా తింటే బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులకు కారణం అవుతాయి.
ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి
యాసిడ్ రిఫ్లెక్స్పడుకునే ముందు తినడం వల్ల ఫుడ్ సరిగా జీర్ణం అవ్వదు. దీంతో యాసిడ్ రిఫ్లెక్స్, గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి. 6లోపు డిన్నర్ చేస్తే ఈ సమస్యలు రావు. ఆకలి కంట్రోల్రాత్రిపూట త్వరగా తినడం వల్ల అతిగా తినడం కంట్రోల్ అవుతుంది. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి కంట్రోల్ అవుతుంది. దీంతో ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యంరాత్రిపూట త్వరగా తినడం వల్ల బాగా నిద్రపడుతుంది. దీని వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
Read Also :Covid-19: ఈ అవయవాలపై కొవిడ్ దాడి..తస్మాత్ జాగ్రత్త