సరిహద్దు దేశం నేపాల్(Nepal) లో మరోసారి భారీ భూకంపం(Earthquak) సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 4.3 గా ఉన్నట్లు నేపాల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి 1 గంటా 33 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో నేపాల్(Nepal) లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత్(India) లోని సరిహద్దు ప్రాంతాలు కూడా భూ ప్రకంపనలకు గురైనట్లు సమాచారం.
అయితే భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అక్కడి విపత్తు నిర్వాహణ యంత్రాంగం పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపింది. నేపాల్ భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ భూకంపాలకు లోనవుతోంది. ఇటీవల వారం వ్యవధిలోనే 4 సార్లు అక్కడ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

తరచూ భూప్రకంపనలు
నేపాల్ ప్రాంతం సబ్ డక్షన్ జోన్ లో ఉంది. అందుకే తరచూ అక్కడ భూప్రకంపనలు సంభవిస్తుంటాయని అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కూడా నేపాల్ లోని పోఖారా ప్రాంతానికి సమీపంలోని కాస్కి జిల్లాలో ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది.
వారం రోజుల్లోనే నాలుగో భూకంపం
వారం రోజుల్లోనే నేపాల్ కేంద్రంగా ఇది నాలుగో భూకంపం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మే రెండో వారంలో తూర్పు నేపాల్ లోని సోలుఖుంబు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా అదే ప్రదేశంలో రెండోసారి భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు లోను కావొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
Read Also: Harvard University : హార్వర్డ్ కు ట్రంప్ భారీ షాక్!