అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో.. ఎలాన్ మస్క్‌కు అక్కడి ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఉద్యోగులను తొలిగించడాన్ని ఏమాత్రం సమర్థించలేకపోతున్న 21 మంది డోజ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తాము అమెరికన్ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ప్రతిజ్ఞ చేశామని.. కానీ అన్యాయంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులను తొలగిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటి కోసం తాము పని చేయలేమని వివరిస్తూనే రాజీనామా లేఖలను అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర దేశాల నేతలను భయపెట్టడమే కాకుండా అమెరికా ప్రజలను సైతం ఆందోళనల్లోకి నెడుతున్నారు. ముఖ్యంగా అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో డోజ్ ఏర్పాటు చేసి.. దేశంలోనే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు.

సివిల్ సర్సీస్ ఉద్యోగులపై కూడా వేటు
అయితే వీటిలో 40 శాతం కాంట్రాక్టులు పూర్తి నిరుపయోగంగా ఉన్నాయని.. వీరి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని వివరించింది. ఇందులో భాగంగానే ట్రంప్.. సివిల్ సర్సీస్ ఉద్యోగులను కూడా తొలగించాలని చూస్తున్నారు. కీలకమైన సివిల్ సర్సీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించలేమని చెబుతూనే.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ముఖ్యంగా వీరంతా తమ రాజీనామా లేఖల్లో.. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశామని.. అధ్యక్ష పాలనా వ్యవస్థల్లో రాజ్యాంగ విలువలను నిలబెడతమని ప్రమాణం చేశామంటూ రాసుకచ్చారు.
అంతేకాకుండా ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్‌లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కసారిగా ఇంతమంది రాజీమానాలు చేయడం ఇటు మస్క్‌తో పాటు అటు ట్రంప్ నకు కూడా షాకేనని తెలుస్తోంది.