ప్రముఖ సింగర్ కల్పన సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. తనమీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అంతేకాకుండా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే తాను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది సింగర్ కల్పన. తన భర్త సపోర్టుతో పీజీ తో పాటు ఎల్.ఎల్.బిను చదువుతున్నట్లు వీడియోలో పేర్కొన్నది. ఒకవైపు సింగింగ్, మరొకవైపు చదువు ఒత్తిడి కారణంతో గత కొన్ని రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ల సూచనల మేరకు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నట్లు వివరాలను వెల్లడించింది.. అయితే త్వరలో పాటలు పాడేందుకు మీ ముందుకు వస్తాను అంటూ సహకరించినటువంటి పోలీసులకు మీడియాకు అంతేకాకుండా తన తోటి గాయకులకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు తన మీద చూపించినటువంటి ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలిపింది.

అధిక మొత్తంలో టాబ్లెట్స్
ఇకపోతే రెండు రోజుల క్రితం కొచ్చి నుంచి వచ్చినటువంటి కల్పన మధ్యాహ్నం సమయంలో మోతాదుకు మించినటువంటి నిద్ర టాబ్లెట్లను వేసుకుంది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసిన కల్పన తను అధిక మొత్తంలో టాబ్లెట్స్ వేసుకున్నారని ఎంత వేసుకున్నానో కూడా తెలియదు అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత భర్త ప్రసాద్ కల్పనకు ఎంత కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించి పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. కేరళ నుంచి ఆమె కూతురు, భర్త వచ్చిన తర్వాత పోలీసులు వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అదే రోజు కూతురు దయా ప్రసాదం మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం చాలా సంతోషంగా ఉందని తీవ్ర ఒత్తిడి సమస్యతో నిద్రమాత్రలను తల్లి కల్పన వాడుతున్నట్లు దయా ప్రసాద్ తెలిపింది.