हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

Anusha
Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

తాము బాల్యంలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు ఖర్చు చేసి మరీ ఇంటర్నేషన్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.వివరాలు ఈ సంఘటన రాజస్థాన్‌(Rajasthan)లో వెలుగు చూసింది. తమకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ఇంతటి వాళ్లను చేసిన పాఠశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని చూసి ఆ సోదరుల మనసు విలవిల్లాడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పాఠశాల రూపురేఖలు మార్చే పనిలోకి దిగారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం వారు అక్షరాల 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారే రాజ్సమంత్ జిల్లా, శిషోదా గ్రామానికి చెందిన మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్. ఈ సోదరులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.శిశోదా గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్‌లు తమకు విద్యాబుద్దులు నేర్పిన కంకుబాయ్ సోహన్‌లాల్ ధాకడ్(Sohanlal Dhakad) గవర్నమెంట్ సీనియర్ సెకండరీ పాఠశాలని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి కుటుంబానికి చెబితే వారు కూడా అందుకు అంగీకరించారు. రంగంలోకి దిగిన సోదరులు ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టాప్ కార్పొరేట్ స్కూల్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా దాన్ని అభివృద్ధి చేశారు.

నిర్మించిన

ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలతో కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుక(School opening ceremony) వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’నినాదానికి అనుగుణంగా ఇంత చక్కటి స్కూల్ బిల్డింగ్ నిర్మించిన సోదరులను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం
Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

అవసరం

ఈ సందర్భంగా మేఘరాజ్‌, అజిత్‌(Meghraj, Ajit Dhakad) మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇకపై తమ గ్రామంలోని ప్రజలు నాణ్యమైన విద్య కోసం బయట ప్రాంతాలకు, లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాబోయే తరాలకు ఈ స్కూల్ మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నాము అన్నారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.

Read Also : Coexistence: సహజీవనం అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం కోర్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870