భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor), బన్యన్ ఉల్ మర్సూస్ ఉధృతంగా సాగుతున్నాయి. ఇందులో భారత్ దే పైచేయి అవుతోంది. అయితే మధ్యలో పాకిస్తాన్ (Pakistan) సంధిస్తున్న డ్రోన్లు, మిసైళ్లు పశ్చిమ సరిహద్దుల్లోని రాష్ట్రాలపై పడుతున్నాయి. వీటిని ఎక్కడికక్కడ భారత సైన్యం అడ్డుకుంటున్నా.. పలు చోట్ల ఆస్తినష్టం, జన నష్టం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న జనం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ లు కోరుకుంటున్నారు.

మొబైల్ అలర్ట్స్ లభిస్తే ..
ముఖ్యంగా శత్రుదేశం సంధిస్తున్న డ్రోన్లు, మిసైళ్లు వస్తాయనే సమాచారం అందినప్పుడు వెంటనే మొబైల్ అలర్ట్స్ (Mobiles Alret) లభిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తప్పించుకునే అవకాశం ఉంటుందని జనం భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే అలర్ట్ లు మనకు అందాలంటే మన మొబైల్ ఫోన్ లో చిన్నపాటి సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు కూడా ఈ సెట్టింగ్స్ చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే అలర్ట్స్ ఎప్పటికప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది.
నెట్ వర్క్ సమస్యలతో సంబంధం అలర్ట్ మెసేజ్
నెట్ వర్క్ సమస్యలతో సంబంధం లేకుండా ప్రభుత్వం పౌరులకు ఈ అలర్ట్ మెసేజ్ లు పంపుతోంది. ముఖ్యంగా పౌరులు తాము ఉంటున్న ప్రాంతాల్లో ఏదైనా దాడి జరిగినా, ప్రకృతి విపత్తులు ఎదురైనా అప్రమత్తం అయ్యేందుకు ఈ మెసేజ్ లు పంపుతున్నారు. వీటి కోసం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎమర్జెన్సీ అలర్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో వైర్ లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీన్ని క్లిక్ చేశాక కనిపించే అన్ని ఆప్షన్స్ ను ఆన్ చేసుకోవాలి.
ఐఫోన్ యూజర్లు సైతం..
అలాగే ఐఫోన్ యూజర్లు సైతం సెట్టింగ్స్ లోకి వెళ్తే గవర్నమెంట్ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోంటే సరిపోతుంది. ప్రభుత్వం అందించే ఈ ఉచిత సేవకు ఎలాంటి ఛార్జ్ చేయరు. ఇప్పటికే పిడుగులు పడే ప్రాంతాల్లో వాతావారణ శాఖ ఫోన్లకు ఇలాంటి ఎమర్జెన్సీ మెసేజ్ లు పంపుతోంది. వీటి తరహాలోనే యుద్ధం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్న ప్రాంతాలకూ అలర్ట్స్ పంపుతున్నారు.
Read Also: America: పాకిస్తాన్ కు అమెరికా ఫోన్ యుద్ధ వివరాలపై ఆరా