ఉగాది అంటే యుగాది, అంటే యుగం ఆరంభమైన రోజు.ప్రతి సంవత్సరానికీ ప్రత్యేకమైన పేరు ఉంటుంది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఉగాది పండుగ నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు.ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకునే విధానం, పూజా సమయాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ తెలుగు వారికి మాత్రం ఉగాది నుంచి కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. తెలుగు మాసాల ప్రకారం చైత్ర పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగ నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. మిగతా పండగలతో పోలిస్తే,ఉగాదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పర్వదినం నాడు కచ్చితంగ ఉగాది పచ్చడి సేవిస్తారు. షడ్రుచుల మిళితమైన ఈ పచ్చడి మన జీవితంలో వచ్చే భావోద్వేగాలకు ప్రతి రూపం.అలానే ఉగాది నాడు కచ్చితంగా పంచాగ శ్రవణం చేస్తారు.
ఉగాది పూజా సమయం
తేదీ: 2025 మార్చి 30 (ఆదివారం)శుభ ముహూర్తం: ఉదయం 5:00 గంటల నుండి 7:30 గంటల వరకు,ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు – కొత్త బట్టలు ధరించటం, యజ్ఞోపవీత ధారణ చేయటం, ఉగాది పచ్చడి తినటం శుభప్రదం.
ఉగాది రోజు శుభకార్యాలు
ఇంటిని శుభ్రం చేయాలి – పండుగ రాకముందు ఇంటిని శుభ్రం చేసి, గుమ్మానికి మామిడి తోరణాలు, వేప కొమ్మలు కట్టాలి. నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి – నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని, కుంకుడుకాయలతో తలకు స్నానం చేయడం శుభప్రదం. కొత్త బట్టలు ధరించడం మంగళకరం – శుభసూచకంగా కొత్త బట్టలు ధరించాలి.ఉగాది పచ్చడి తినాలి – ఉగాది ప్రత్యేకత అయిన వేప పువ్వు పచ్చడిని తప్పక తినాలి, ఇది జీవితంలో అనుభవించే అన్ని రకాల అనుభూతులను సూచిస్తుంది.దేవుడికి పూజ చేయాలి – ఉదయం పూజ చేసుకుని నూతన సంవత్సరాన్ని ఆరంభించాలి.

ఉగాది రోజున చేయకూడని పనులు
ఇంటి చెత్తను బయటకు వేయకూడదు – ఉగాది ముందు రోజు సాయంత్రం ఇంటి శుభ్రపరచి, చెత్తను బయటకు వేస్తే సంపద నష్టమవుతుందనే నమ్మకం ఉంది.ఇతరులతో గొడవలు చేయకూడదు – ఈ రోజు ఎలా గడుస్తుందో, అదే విధంగా ఏడాది మొత్తం కొనసాగుతుందని నమ్ముతారు. అందువల్ల వాగ్వాదాలు, తగాదాలు జరగకుండా చూసుకోవాలి.అప్పులు తీసుకోవద్దు, ఇవ్వద్దు – ఆర్థికంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. మాంసాహారం, మద్యం సేవించడం వలన అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు – ఇది అనారోగ్య సంకేతంగా భావిస్తారు.
గమనిక
ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే,వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.