ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో 23 మ్యాచ్ ల తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 5 మ్యాచ్‍ల్లో 4 విజయాలతో 8 పాయింట్లను కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లను కలిగి ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్‍ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో ఉంది. నికర రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లను కలిగి ఉంది. కానీ నికర రన్ రేట్ ఆధారంగా కేకేఆర్ మెరుగ్గా ఉంది. ఐపీఎల్‌లో ప్రతి విజయం తర్వాత 2 పాయింట్లు ఇవ్వబడతాయి. అయితే నికర రన్ రేట్ గెలుపు, ఓటమి మధ్య వ్యత్యాసం ఆధారంగా లెక్కించబడుతుంది. టై అయిన మ్యాచ్ లో జట్లకు తలో ఒక పాయింట్ ఇవ్వబడుతుంది.
పాయింట్ల పట్టిక
ర్యాంకింగ్స్ లో టాప్-2 జట్లకు ఫైనల్ కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. నిజానికి క్వాలిఫయర్-1 టాప్-2 జట్ల మధ్య జరగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం పొందుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరిన రెండో జట్టు అవుతుంది.

ప్లేఆఫ్స్ చేరుకోవడానికి
ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి, ఎన్ని పాయింట్లు అవసరం,నిజానికి ప్రతి సీజన్ లో ఈ లెక్కలు మారిపోతుంటాయి. అయితే 8 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 14 పాయింట్లు ఉన్న జట్లు కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం కూడా చాలా సార్లు కనిపించింది. ఒక్కోసారి 12 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.ఐదుసార్లు ఛాంపియన్ టీం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో ఆశించిన విధంగా ఆడలేకపోతోంది. నాల్గవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విధంగా చెన్నై మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది. ఆ చెన్నై జట్టు ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరుకోగలదా అని క్రికెట్ అభిమానుల మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే, ప్రస్తుత ఆటతీరును చూస్తుంటే చెన్నై ప్లేఆఫ్ ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి.
Read Also: IPL 2025:1307 పరుగులతో రెండో స్థానంలో ఓపెనర్ సాయి సుదర్శన్