ఎండు చేపలు (Dry Fish) అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థంగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ D, ఐరన్, జింక్, కాల్షియం లాంటి ముఖ్యమైన మైనరల్‌లు ఉంటాయి. ఇవి శరీర శక్తిని మెరుగుపరచడంతో పాటు మూలకంగా ఉన్న పోషకాల తక్కువతనాన్ని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, గర్భిణీలకు, పోషకాహార లోపంతో బాధపడే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంగన్వాడీలలో ఎండు చేపలు వినియోగంపై సూచన
ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఈ అంశంపై స్పందించారు. తీరప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో ఎండు చేపలను ఒక మంచి ప్రోటీన్ వనరుగా అందించడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలను అందించగలిగే సామర్థ్యం ఎండు చేపలకు ఉంది. ఇది పిల్లల ఎదుగుదల, బోధనా సామర్థ్యానికి కూడా తోడ్పడే అవకాశముందని ఆమె పేర్కొన్నారు.
కొంతమందికి మాత్రం జాగ్రత్తలు అవసరం
అయితే ఎండు చేపల్ని అందరూ తినవచ్చనేది పూర్తిగా నిజం కాదు. ముఖ్యంగా బీపీ, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఎండు చేపల వినియోగాన్ని నివారించడమే మేలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు శాతం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరగవచ్చు. అందువల్ల వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎండు చేపల వినియోగం చేయాలి. సరైన పరిమాణంలో, సరిగా ఉడికించి తింటే మాత్రం ఇది ఆరోగ్యానికి బలాన్నిచ్చే ఆహారంగా మారుతుంది.
Read Also : Indirammas Houses : ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన తెరపైకి