వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ

వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో నిలిపివేసిన ఓ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 2014 నుంచి 2019 వరకూ.. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు తమ పొలంలో భూసారాన్ని పెంచుకునేందుకు, రైతులకు జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తూ వచ్చింది.

Advertisements
వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ

3 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలు

2014-19 మధ్య కాలంలో రైతులు దిగుబడి పెంచుకునేందుకు సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలను అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు. రైతుల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే భూసారాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వెట్ కెమిస్ట్రీ విధానం అనుసరిస్తున్నామని, దీని స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతి ఫాలో కానున్నట్లు తెలిపారు.

ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట
రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. ఇందుకోసం రూ.240 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టా‌క్‌ల నిర్వహణ కోసం రూ.40 కోట్లు ప్రతిపాదించారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల రైతు కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి రూ.61.78 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కోసం రూ.9400 కోట్లు, పంటల బీమా పథకానికి రూ.1023 కోట్లు ప్రతిపాదించారు.

Related Posts
Visa : రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు
Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు

వీసాల రద్దుపై కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు – అమెరికా నిర్ణయంపై భయాందోళన అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఎదురైన అసాధారణ సమస్య ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని Read more

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 Read more

Supreme Court : పోలీసులు కంట్రోల్ తప్పద్దూ.. మీకు కొన్ని నియమాలు ఉన్నాయి: సుప్రీంకోర్టు
Supreme Court : పోలీసులు కంట్రోల్ తప్పితే సుప్రీంకోర్టు చర్యలు తప్పవు

భారతదేశంలో న్యాయ వ్యవస్థలో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. కానీ, వారు అరెస్టు చేసే సమయంలో కొన్ని నిబంధనలను పాటించకపోవడం, నిందితుల హక్కులను ఉల్లంఘించడం తరచుగా చర్చనీయాంశమవుతోంది. Read more

తల్లికి వందనంపై నారా లోకేష్ కీలక ప్రకటన
తల్లికి వందనంపై నారా లోకేష్ కీలక ప్రకటన

ఏపీలో కూటమి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పథకాల లబ్దిదారులు 8 Read more

Advertisements
×