ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Scam Case)లో మరో కీలక మలుపు ఏర్పడింది. ఈ కేసులో A-31 గా ఉన్న ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), A-32 గా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) ను పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితులకు మే 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు దాదాపు మూడు గంటల పాటు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఈ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ జైలు కు తరలింపు
రిమాండ్ అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో నిందితులందరినీ ఒకేసారి విచారణ చేయాలని భావించిన కోర్టు, అన్ని విషయాలను పరిశీలించి వారిని ఇతర నిందితులతో కలిపి రిమాండ్‌లోకి తీసుకుంది. కేసులో కీలకమైన ఆధారాలు వెలుగులోకి రావాల్సిన నేపథ్యమందు, విచారణ మరింత వేగంగా సాగే అవకాశం ఉంది.
కోర్టు ప్రత్యేక ఆదేశాలు
ఇక నిందితుల వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కోర్టు ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చింది. ధనుంజయ రెడ్డికి ఇన్సులిన్ అవసరం ఉండటంతో ఆయన కోసం జైలులో ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, వెస్ట్రన్ కమోడ్, మంచం, దిండు, దుప్పటి, డ్రైఫ్రూట్స్ వంటివాటికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అంశాలు మరోసారి లిక్కర్ కేసులో నిందితుల ప్రాధాన్యతను, ఆరోగ్యపరమైన అంశాలను చూపిస్తున్నాయి.
Read Also : Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు