తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 9 నుంచి 25వ తేదీ వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు మొత్తం 48 ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్లు ప్రకటించారు. ఇది రైలులో ప్రయాణించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హర్యానా రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించే అంశం. తిరుపతి-హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 రైళ్లు నడుస్తాయి.నరసాపూర్-తిరువణ్ణామలైకు బుధ, గురువారాల్లో 16 రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ-తిరుపతి మధ్య గురు, శుక్రవారాల్లో 8 రైళ్లు నడుపుతారు. తిరుపతి-హిసార్ (04717) మధ్య బుధ, ఆదివారాల్లో 12 రైళ్లు నడుస్తాయి. ఈ రైలు తెలంగాణ (Telangana) లోని సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్, ఖమ్మంలో ఆగుతుంది. ఏపీలోని విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్‌లలో ఆగుతాయి.నరసాపురం-తిరువన్నామలై (అరుణాచలం) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
అరుణాచలంలో
ఈ రైలు 07219 నంబరుతో, జులై 9, 16, 23 ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నరసాపురం రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.55 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.ఈ రైలు 07220 తిరుగు ప్రయాణంలో జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెపెంబరు 4, 25వ తేదీల్లో అరుణాచలం నుంచి నడుస్తుంది. ఈ రైలు అరుణాచలం (Arunachalam) లో ఉదయం 11 గంటకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు నరసాపురం వస్తుంది.ఈ ప్రత్యేక రైలు ఏపీలోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరులో ఆగుతుంది.

ఈ విషయాన్ని గమనించాలని
అనంతరం తమిళనాడులోని కాట్పాడి, వేలూరు రైల్వే స్టేషన్‌లలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు అధికారులు. అవసరమైన వాళ్లు ఈ రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ప్రతి సంవత్సరంలోనే వేసవి సెలవులు, పుణ్యక్షేత్రాల సందర్శన, పండుగలు వంటి సందర్భాల్లో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మంచి సేవలతో ముందుకు వచ్చారు. ఈ ప్రత్యేక రైళ్ల (Special trains) ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో, సమయానుకూలంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుంది.అందుకే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com