Vinayaka Chavithi: గణేష్ చతుర్థి దగ్గరపడింది. ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27న దేశవ్యాప్తంగా భక్తులు వినాయక చవితిని(Vinayaka Chavithi) ఎంతో ఉత్సాహంగా జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు గణేశుడికి ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. భక్తులు తమ ఇళ్లలో, మండపాలలో గణపతిని ప్రతిష్టించి, ప్రతిరోజూ పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. వీటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నవి మోదకాలు.
నువ్వుల మోదకం & మలై మోదకం
వినాయకుడికి ఇష్టమైన మిఠాయిలలో(Sweets) ఒకటి నువ్వుల మోదకం. దీనిని నువ్వులు, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుముతో పూరణ చేసి, బియ్యం పిండితో చేసిన పిండిలో నింపి ఆవిరి మీద ఉడికిస్తారు. అలాగే మలై మోదకం రుచికరమైన వంటకం. పాలు, కుంకుమపువ్వు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, బాదం పలుకులతో దీన్ని సిద్ధం చేస్తారు. పాలను మరిగించి కోవా తయారు చేసి, తరువాత మిశ్రమాన్ని పిండిలా చేసుకుని మోదకాలుగా మలుస్తారు.

పోహా మోదకం & ఉకడిచే మోదకం
పోహా మోదకం కర్ణాటకకు ప్రత్యేకత. దీనిని బెల్లం, నెయ్యి, పోహా, యాలకుల పొడి, జీడిపప్పుతో తయారు చేస్తారు. రుచిలో అద్భుతంగా ఉండే ఈ మోదకాలను భక్తులు వినాయకుడికి సమర్పిస్తారు. మరోవైపు, మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఉకడిచే మోదకం కూడా వినాయక చవితి సందర్భంగా విస్తృతంగా తయారు చేస్తారు. బియ్యం పిండి, కొబ్బరి తురుము, బెల్లంతో ఈ మోదకాలు తయారవుతాయి. వీటిని ఆవిరిపై ఉడికించి సమర్పిస్తారు.

చాక్లెట్ మోదకం
చాక్లెట్ మోదకం ఆధునిక రుచులకు తగ్గట్టు భక్తులు తయారు చేసే ఒక ప్రత్యేక నైవేద్యం. బియ్యం పిండి, చాక్లెట్, డ్రై ఫ్రూట్స్‌తో దీన్ని సిద్ధం చేస్తారు. ముఖ్యంగా పిల్లలకు ఈ మోదకాలు ఎంతో ఇష్టమైనవి. పెద్దవారూ కూడా ఈ వేరైటీని ఆనందంగా స్వీకరిస్తారు. ఈ విధంగా, సాంప్రదాయ మోదకాలతో పాటు కొత్త రకాల మోదకాలను కూడా వినాయకుడికి సమర్పించడం పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా చేస్తుంది.

వినాయక చవితి 2025 ఎప్పుడు జరుపుకుంటారు?
2025 ఆగస్టు 27న జరుపుకుంటారు.
వినాయకుడికి ఇష్టమైన మిఠాయి ఏది?
వినాయకుడికి మోదకాలు ఎంతో ఇష్టం.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :