हिन्दी | Epaper

TTD : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

sumalatha chinthakayala
TTD : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

TTD : తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.

నేడు శ్రీవారి ఆర్జిత సేవా

జూన్ నెల కోటాను మార్చి 21న

తిరుమలలో జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870