రాఖీ పండగ అంటే రక్షాబంధన్. ఇది హిందూ మతంలో సోదరుడు – సోదరి బంధానికి ప్రతీకగా భావించే పవిత్రమైన పండుగ. ప్రతియేటా శ్రావణ మాస శుక్ల పౌర్ణమికి రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్బంగా సోదరీమణులు తమ అన్నల చేతికి రాఖీ కడతారు. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు… ప్రేమ, రక్షణ, బాధ్యత, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే సాంప్రదాయం.రాఖీ పండుగ (Rakhi festival) వెనుక అనేక పురాణ గాధలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ తెలుసుకుందాం:
శ్రీకృష్ణుడు – ద్రౌపది కథ:
మహాభారతంలోని ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుంది. శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన వెంటనే ద్రౌపతి తన చీర అంచును చించి కృష్ణు (Krishna) డి వేలికి కట్టింది. ఆ దారం కేవలం వస్త్రం కాదు. అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన వాగ్దానం. ప్రతిగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నిస్సహాయ సమయంలో, కృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఈ సంఘటనతో రాఖీ కట్టడం అత్యంత భావోద్వేగ, దైవిక వివరణగా పరిగణించబడుతుంది.

ఇంద్రుడు, ఇంద్రాణి:
పురాణాల ప్రకారం దేవలోక అధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలైనప్పుడు.. అతని భార్య ఇంద్రాణి ప్రత్యేక మంత్రాలతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని మణికట్టుపై కట్టింది. ఈ దారం శ్రావణ పూర్ణిమ రోజున కట్టబడిన రక్ష-సూత్రం. దీని తరువాత ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడు. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు.. రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా ఉంటుందని ఇది రుజువు చేస్తుంది. నమ్మకం ఉన్న చోట రక్ష సూత్రం పనిచేస్తుంది.
వామనుడు, బలి, లక్ష్మిదేవిల సంబంధం:
శ్రీ మహా విష్ణువు వామన రూపంలో వచ్చి బలి రాజు నుంచి మూడు అడుగుల భూమిని అడిగినప్పుడు.. బలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి స్వర్గాన్ని కూడా దానం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రాహ్మణ వధువుగా వేషంలో బలి దగ్గరికి వెళ్లి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసింది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి వరం కోరాడు. ఈ కథ రాఖీ రక్షణ కోసమే కాదు దేవుడిని ప్రేమ, నమ్మకంతో బంధించగలదని చూపిస్తుంది.
గమనిక:ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
రక్షాబంధన్ ఎప్పుడు జరుపుకుంటారు?
రక్షాబంధన్ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు, ఇది ఆగస్టు నెలలో వస్తుంది.
రక్షాబంధన్ పూర్వకథ ఏంటి?
రక్షాబంధన్ పూర్వకథలలో ప్రసిద్ధంగా శ్రీ కృష్ణుడు ద్రౌపది చేతి గాయం అయినప్పుడు ఆమె తన చీర నుంచి భాగం చించి కట్టడం. తరువాత శ్రీ కృష్ణుడు ఆమెను చీరహరణ సమయంలో రక్షించడం. ఇదే రక్షాబంధన్ భావనకు మద్దతిచ్చే ఉదాహరణ.
Read hindi news: hindi.vaartha.com
Read also: