పితృ దోషాల కారణంగా కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య, ఆర్థిక అవరోధాలు ఉంటాయని అనేక పండితులు చెబుతున్నారు. అలాంటి దోషాలను శాంతింపజేసి పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందడానికి మౌని అమావాస్య(Mauni Amavasya) రోజును ఎంతో శక్తివంతమైన రోజు అని భావిస్తారు. ఈ రోజున చేయబడే ఆచారాలు, ఉపవాసం, మౌనం మనసును పరిశుద్ధం చేసి, పితృ దోషాల ప్రభావాన్ని తగ్గిస్తాయని వారు విశ్వసిస్తున్నారు.
Read Also: MauniAmavasya: అమావాస్య ప్రాముఖ్యత

మౌని అమావాస్యలో పాటించాల్సిన ప్రాధాన్యత ఉన్న ఆచారాలు
1. ఉదయం నదీ స్నానం
సూర్యోదయం నడుమనే లేచి, శుభ సమయాన్ని ఎంచుకొని నదీ స్నానం చేయడం అత్యంత శ్రేయస్కరంగా పరిగణించబడుతుంది. శరీరానికి శుభ్రతతో పాటు ఆధ్యాత్మిక శుద్ధి కూడా కలుగుతుందని పండితులు చెప్పారు.
2. ఉపవాసం మరియు మౌన వ్రతం
ఈ రోజు ఉపవాసం పాటించడం, అంతకంటే మున్ముందు మౌనం ఆచరించడం వల్ల మనస్సు నిశ్శబ్దంగా, ధ్యానానికి అనుకూలంగా మారుతుందని(Mauni Amavasya) చెప్పబడుతుంది. మౌన వ్రతం ద్వారా ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయని, పితృదోష శాంతికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
3. తర్పణం చేయడం
జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు ప్రత్యేకంగా తర్పణం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. పితృ దోషం ఉన్నవారు నల్ల నువ్వుల ద్వారా తర్పణం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
4. దానధర్మాలు
పేదలకు అన్నదానం, వస్త్రదానం, పెరుగు దానం వంటి దానాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతుంది. ఈ దానాలు పితృదోషాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, కుటుంబానికి శాంతి, సుఖసమృద్ధి తీసుకురానుందని విశ్వాసం.
5. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం
మౌని అమావాస్యలో పండితుడికి బూడిద గుమ్మడికాయను దానం చేయడం కూడా మంచి కార్యంగా చెప్పబడుతుంది. ఇది పితృదేవతల కృపను పొందడానికి సహాయపడుతుందని పండితులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: