ఇంద్రకీలాద్రి: దుర్గమ్మవారికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఇఓ వికె శీనా నాయక్ నేతృత్వంలో గురువారం ఆషాడ మాసం సారె నందించారు. ఆలయ వైదిక బృందం రు. 4,25,000లతో 40 గ్రాముల బంగారు హారాన్ని సారెతో పాటు అందించారు. వేదమంత్రాలు, మేళతాళాలు, మంత్రపఠనాలతో డోలు, సన్నాయిలతో శ్రీ అమ్మవారి కీర్తనలను పలికిస్తూ దుర్గమ్మవారికి (Durgamma) ఆషాడమాసం చివరిరోజు సారెను అందించారు. కార్యక్రమంలో ఇఓ వికె శీనా నాయక్ ఇతర అధికారులు, వైదిక బృందం, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

చివరిరోజు వెల్లువెత్తిన భక్తబృందాలు:
ఆషాడమాసం చివరిరోజు అమావాస్య నాడు దుర్గమ్మవారికి సారెను అందించడానికి భక్తబృందాలు వెల్లువెత్తాయి. నూతన యాగశాలలో చండీహోమములు ప్రారంభం చండీహోమం, విఘ్నేశ్వర, సరస్వతి, తదితర హోమాది క్రతువులు దేవస్థానంలో శ్రీకృష్ణ, రాద మూర్తులు వేంచేసియున్న ప్రాంతంలో నూతనంగా నిర్మాణమైన యాగశాలలో 8 నుండి నిర్వహించడం వేదోక్తంగా గురువారం ప్రారంభించారు.
ఆగస్టు పవిత్రోత్సవాలు:
దుర్గమ్మవారి ఆలయంలో ఆగస్టు 8 నుండి 10 వరకు 3 రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మూడు రోజులు ఆర్జితసేవలు అన్ని రద్దు, చేస్తున్నామన్నారు. –
ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం:
ఇఓ 22న దుర్గమ్మవారి ఆలయంలో ఆగస్టు8న వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham) ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దుర్గమ్మవారు వరలక్ష్మి వ్రతం సందర ్భంగా వరలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారన్నారు.
సామూహిక వరలక్ష్మి వ్రతాలు:
ఆగస్టు 22న సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామన్నారు. రు.1500 ఉభయంతో ఆర్జిత సేవగా ఉదయం 7 నుండి నిర్వహిస్తామన్నారు. ఉచితంగా వ్రతంలో పాల్గొనే భక్తులకు ఉదయం 10.30 నుండి 11 వరకు సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని భక్తులు పాల్గొని దుర్గమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలన్నారు. పాల్గొనదలచిన భక్తులు ఆగస్టు 18 నుండి దరఖాస్తులు ఇస్తామన్నారు.
ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు: దుర్గమ్మవారి ఆలయంలో ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి నిర్వహిస్తామని ఇఓ తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Sravana Masam : నేటి నుంచి శ్రావణ మాసం