21 రకాల పత్రాలు – ఔషధ గుణాలు
Ganesh patri puja list: విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు(ganesh chaturthi 2025). వినాయక చవితిరోజున వినాయకునికి ‘ఏకవింశతి’ పత్రాలు(21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది.
21 రకాల పత్రాలు – ఔషధ గుణాలు – (Ganesh patri puja list)
- బిల్వ పత్రం → Bilva Patram
- దూర్వాయుగ్మం (గరిక) → Doorvayugmam (Garika)
- బృహతీ పత్రం → Bruhati Patram
- మాచీ పత్రం → Machi Patram
- ఉత్తరేణి → Uttareni
- చూత పత్రం → Choota Patram
- ఉమ్మెత్త → Ummetta
- బదరీ పత్రం → Badari Patram
- తులసి → Tulasi
- గన్నేరు → Ganneru
- అర్జున పత్రం → Arjuna Patram
- మరువం → Maruvam
- శమీ పత్రం → Shami Patram
- విష్ణుక్రాంత పత్రం → Vishnukranta Patram
- వావిలాకు → Vavilaku
- జాజి పత్రం → Jaji Patram
- రావి ఆకులు → Ravi Aakulu
- దేవదారు పత్రం → Devadaru Patram
- దానిమ్మ → Danima
- అర్క పత్రం → Arka Patram
- గండకీ పత్రం → Gandaki Patram
1) బిల్వ పత్రం – ( Bilva Patram)
దీనిని మారేడు అని కూడా పిలుస్తారు. గణేశునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మారేడు వేర్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడుగా పని చేస్తుంది.

2) దూర్వాయుగ్మం (గరిక)- (Doorvayugmam (Garika)
గణపతికి ఇష్టమైన పత్రం గరిక. తులసి తరువాత అంత పవిత్రమైంది గరిక.

3) బృహతీ పత్రం – (Bruhati Patram)
దీనిని వాకుడాకు, నేల మునగాకు అని కూడా పిలుస్తారు. గొంతు సమస్యలు, శారీరక నొప్పులు, కఫం, వాత దోషాలు తగ్గిస్తుంది.

4) మాచీ పత్రం – ( Machi Patram)
ఇది ఆయుర్వేద మూలిక. నేత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.

5) ఉత్తరేణి – (Uttareni Patram)
దీని పుల్లలు యజ్ఞాలు, హోమాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.

6) చూత పత్రం – (Choota Patram)
చూత పత్రం అంటే మామిడాకు. చిగుళ్ల వాపు సమస్యలను నివారిస్తుంది. మామిడి తోరణం లేకుండా ఏ శుభ కార్యం ప్రారంభం కాదు.

7) ఉమ్మెత్త – (Ummetta Patram)
దీనిని దత్తూర పత్రం అని పిలుస్తారు. కఫ, వాత దోషాలను తగ్గిస్తుంది.

8) బదరీ పత్రం – ( Badari Patram)
బదరీ పత్రం అంటే రేగు. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపం. అన్నం అరుగుదలకు, గాయాలకు రేగు ఆకులు మంచి ఔషధంలా పని చేస్తాయి.

9) తులసి – (Tulasi Patram)
తులసి పరమ పవిత్రమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. వినాయక చవితి రోజున మాత్రమే గణేశుని పూజలో తులసి దళాలను వినియోగించాలి.

10) గన్నేరు – (Ganneru Patram)
గన్నేరును కరవీర పత్రం అని పిలుస్తారు. గన్నేరు చెట్ల నుంచి వచ్చే గాలి పీలిస్తే వివిధ రకాల రోగాలు నయమవుతాయి.

11) అర్జున పత్రం – (Arjuna Patram)
దీనిని మద్ది అని కూడా పిలుస్తారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. కఫ, వాత, పైత్య దోషాలను తగ్గిస్తుంది.

12) మరువం – (Maruvam Patram)
దీనిని చిన్న చిన్న కుండీల్లో సైతం పెంచవచ్చు. మంచి సువాసన గల పత్రం ఇది.

13) శమీ పత్రం – (Shami Patram)
దీనిని జమ్మి అంటారు. జమ్మిచెట్టు బెరడు దగ్గు, అస్తమాకు ఔషధంలా పని చేస్తుంది.

14) విష్ణుక్రాంత పత్రం – (Vishnukranta Patram)
విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది. తామర వ్యాధిని సైతం తగ్గిస్తుంది.

15) వావిలాకు – (Vavilaku)
వావిలాకులు వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటినొప్పులు తగ్గుతాయి.

16) జాజి పత్రం – (Jaji Patram)
దీనికి కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలు, కామెర్లు, కండ్లకలక, కడుపులో నులిపురుగులను తగ్గించడంలో జాజి ఆకులను ఉపయోగిస్తారు.

17) రావి ఆకులు – (Ravi Aakulu)
రావి వృక్షాన్ని అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం. రావి భస్మాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. రావి కొమ్మలను హోమాల్లో ఎక్కువగా వాడుతారు. చర్మ, ఉదర సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.

18) దేవదారు పత్రం – (Devadaru Patram)
వనాల్లో పెరిగే వృక్షం ఇది. పార్వతీదేవికి ఎంతో ప్రీతికరం. హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే దొరుకుతుంది. దేవదారు నూనె మెదడు, కంటి సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దేవదారు నూనె వేడినీళ్లలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ సమస్యలు నయం అవుతాయి.

19) దాడిమీ పత్రం – (Dhamidi patram)
దానిమ్మ అంటే దాడిమీ పత్రం. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చే పొక్కులు, గాయాలు మానుతాయి. వాపు తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలను సైతం తగ్గిస్తుంది.

20) అర్క పత్రం – (Arka Patram)
అర్క పత్రం అంటే జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు మొదలైనవి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కానీ జిల్లేడుపాలు కళ్లల్లో పడితే కంటికి హాని కలుగుతుంది. జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది.

21) గండకీ పత్రం – (Gandaki Patram)
దీనిని దేవ కాంచనం అని పిలుస్తారు. థైరాయిడ్ సమస్యకు ఔషధంలా పని చేస్తుంది గండకీ పత్రం.దగ్గు, జలుబులను నివారిస్తుంది.

Read Also: