సరస్వతీ పుష్కరాల సందర్భంగా (Kaleshwar Temple) భక్తులతో కిక్కిరిసి పోతోంది. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో( crowd )తారస్థాయికి చేరగా, ఆదివారం ఒక్కరోజే లక్షన్నర మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు.భక్తుల రాకతో కాళేశ్వరం వీధులన్నీ సందడిగా మారిపోయాయి. మొదటి రెండు రోజుల్లో జనసాంద్రత తక్కువగా ఉన్నా, వీకెండ్‌లో మాత్రం భారీగా గణనీయమైన సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుష్కర స్నానాల ( Pushkara Baths) అనంతరం భక్తులు ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఈ పవిత్ర ఘట్టానికి పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధండ విద్యాశంకర భారతి మహాస్వామి, హైకోర్టు న్యాయమూర్తి సుధా, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు వచ్చారు. వారు కూడా పుణ్యస్నానాలు చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.భక్తుల సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు తీవ్రంగా చోటుచేసుకున్నాయి.

మహాదేవపూర్ నుంచి కాళేశ్వరం దాకా దాదాపు 10 గంటల పాటు రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది.16 కిలోమీటర్ల మేర బస్సులు, ప్రైవేట్ వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. అన్నారం క్రాస్ వద్ద RTC బస్సు పంచర్ కావడంతో ట్రాఫిక్ సమస్య మొదలైందని భక్తులు తెలిపారు.వేడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ట్యాంకర్ల సాయంతో సరఫరా అందిస్తున్నారు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు.
ఇవన్నీ భక్తులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాయి.అయితే భక్తుల రద్దీ పెరుగుతుందన్న విషయాన్ని ముందుగానే అంచనా వేయకుండా అధికారులు స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈసారి పుష్కరాల ప్రత్యేక ఆకర్షణగా హెలీకాప్టర్ జాయ్ రైడ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఓఆర్‌జి ద్వారా నిర్వహిస్తున్న ఈ సేవ ద్వారా భక్తులు కాళేశ్వరం మొత్తం aerial view లో తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.4,500 రుసుము నిర్ణయించారు. ఇది భక్తులకు వినూత్న అనుభూతిని ఇస్తోంది.సోషల్ మీడియా ద్వారా పుష్కరాల సమాచారం విస్తృతంగా ప్రచారమవుతోంది. దీని వలన భక్తుల రాక మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా అక్కడే బస చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Read Also : Tom Curran : ‘భారత్-పాక్ ఉద్రిక్తతలతో ఏడ్చేసిన విదేశీ క్రికెటర్’ : టామ్ కరన్