ముంబై (Mumbai) నగరంలోని విరార్ వెస్ట్ ప్రాంతంలో ఓ అరాచక ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక “సీడీ గురుదేవ్” భవనంలోని నివాసితులు లిఫ్ట్‌ను ఉపయోగించేందుకు వెళ్లినపుడు, లోపల మూత్రం వాసన వస్తుండటాన్ని గమనించారు. ఇదే ఆధారంగా వారు భవనం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, అందులో కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యం కలిగించాయి.ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించగా, బ్లింకిట్ యూనిఫాం ధరించిన డెలివరీ ఏజెంట్ (Delivery agent) ఓ పార్శిల్‌ను పట్టుకుని లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. కొద్దిసేపు అక్కడ తిరిగిన తర్వాత… లిఫ్ట్ మూలలోనే మూత్ర విసర్జన చేశాడు. ఇది చూసిన నివాసితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకటిన్నర నిమిషాలపాటు జరిగిన ఆ దృశ్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
డెలివరీ బాయ్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించిన నివాసితులు
ఈ దృశ్యాలను ఆధారంగా తీసుకుని, వారు వెంటనే బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బందికి వీడియో చూపించి, నిందితుడిని గుర్తించారు. ఆ తర్వాత అతనిపై దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. భవనం స్వచ్ఛతను దెబ్బతీసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఈ వ్యవహారంపై స్పందించిన బోలింజ్ పోలీసులు, నిందితుడిపై అధికారికంగా కేసు నమోదు చేశారు. అతడి అభద్రత ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. ముంబై నగరంలో ఇటువంటి సంఘటనలు అంతుచిక్కని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ తరహా ప్రవర్తనపై బ్లింకిట్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also : Gold theft : సూర్యాపేటలో నగల దుకాణం నుంచి 8 కిలోల బంగారం చోరీ