2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల పెరుగుదల ఉండదని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా లబ్ధిపొందుతాయనే భావన పెరుగుతోంది.
డీలిమిటేషన్ ప్రభావం
లోక్ సభలో మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129. అంటే 24 శాతం. తెలంగాణ- 17, ఏపీ- 25, కేరళ- 20, తమిళనాడు- 39, కర్ణాటక- 28 స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 753కు పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న 24 నుంచి 19 శాతానికి పడిపోతుంది. డీలిమిటేషన్ తరువాత తెలంగాణ- 20, ఏపీ- 28, తమిళనాడు- 41, కర్ణాటక- 36 వరకు సీట్లు పెరుగుతాయి. కేరళలో ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 20 నుంచి 19కి పడిపోయే అవకాశం ఉంది.
జనాభా ప్రాతిపదికన
ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమితంగా ఉంటోంది. ఇదే ప్రాతిపదిక కావడం వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరుగుతాయనేది ఆందోళన.ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్.

నేడు సమావేశం ఏర్పాటు
దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.చెన్నైలోని ఓ హోటల్ దీనికి వేదిక.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ పై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఫెయిర్ డీలిమిటేషన్
ఫెయిర్ డీలిమిటేషన్అ నది ఈ భేటీ ప్రధాన డిమాండ్. దీనికి హాజరు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు స్టాలిన్. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు కానున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నారు. బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
డీలిమిటేషన్ పై వ్యూహం
పార్లమెంటులో ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక పోరాటం.డీలిమిటేషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూన్నారాయన.