ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సుదీర్ఘ కల చివరకు సాకారమైంది. చెపాక్‌లో జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. 2010 తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం విశేషం. శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.తొలుత కేఎల్ రాహుల్(51 బంతుల్లో 77, 6ఫోర్లు, 3సిక్స్‌లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు ఇషాన్ పోరెల్(33) ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 20 ఓవర్లలో 183/6 స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా, విజయ్ శంకర్(54 బంతుల్లో 69 నాటౌట్, 5ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధసెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. ఆఖర్లో ధోనీ(26 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, సిక్స్) మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యాడు. విప్రాజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీశాడు.
డకౌట్
ఖలీల్ అహ్మద్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికి ఫ్రేజర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను రాహుల్, పోరెల్ పంచుకున్నారు. మంచి ఫామ్‌మీదున్న రాహుల్ చెన్నై బౌలింగ్‌ను దీటుగా తిప్పికొడుతూ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఇన్నింగ్స్ గాడిలో పడుతుందన్న తరుణంలో పోరెల్‌ను జడేజా ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆఖర్లో స్టబ్స్(12 బంతుల్లో 24 నాటౌట్, 2ఫోర్లు, సిక్స్) విజృంభణతో ఢిల్లీ మెరుగైన స్కోరు అందుకుంది.
25 పరుగుల తేడా
ఢిల్లీపై చెన్నై 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఢిల్లీకి వరుసగా మూడో విజయం. ఆరు పాయింట్లు, +1.257 నికర రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా చెన్నై జట్టు రెండు పాయింట్లతో టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు, రన్‌రేట్ -0.891గా ఉన్నది. పంజాబ్‌పై విజయంతో రాజస్థాన్ సైతం పాయింట్ల పట్టికలో పైకి చేరింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు, -0.185 రన్‌రేట్ ఉన్నది. ఇక పంజాబ్ జట్టు మూడు స్థానాలు కోల్పోయింది. ఢిల్లీ-చెన్నై మ్యాచ్ తర్వాత, పంజాబ్ కింగ్స్ మొదటి స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. పంజాబ్ మూడు మ్యాచులు ఉండగా రెండు విజయాలతో నాలుగు పాయింట్లు, +0.074 రన్‌రేట్‌గా ఉన్నది.

చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ తల్లిదండ్రులు తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. శనివారం ఢిల్లీతో చెపాక్‌లో జరిగిన పోరుకు దేవికాదేవి, పాన్‌సింగ్ హాజరయ్యారు. వీరితో పాటు ధోనీ భార్య సాక్షి, కూతురు జివా కూడా స్టాండ్స్‌లో కనిపించారు. తల్లిదండ్రులు మ్యాచ్‌కు రావడంపై ధోనీ రిటైర్మెంట్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్‌కు ఇక వీడ్కోలు పలికేందుకు ధోనీ సిద్ధమయ్యాడంటూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.లక్ష్యఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాప్-3 బ్యాటర్లు రవీంద్ర(3), కాన్వె(13), కెప్టెన్ రుతురాజ్(5) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే చెన్నై 3 కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో శంక ర్ ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయిం ది. ధోనీ మెరుపులు మెరిపించలేకపోయాడు.
Read Also: IPL 2025 :ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో డీసీ