ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌లో స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు.ప్రతి ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండే రాజస్థాన్ రాయల్స్ ఈ సారి చతికిలపడింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, నాలుగింటిలో ఓటమిపాలయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొట్టింది. మొదటి నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఆఖర్లో వరుస రనౌట్లతో ఓటమిపాలయింది. ఎనిమిది పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
అంచనా
29 మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోటాపోటీ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లలో గెలిచింది. ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిన మ్యాచ్‌ల కంటే ఓడినవే ఎక్కువ. ఓవరాల్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ 86 మ్యాచ్‌లు ఆడగా కేవలం 38 మ్యాచ్‌లలోనే విజయం సాధించి, 46 మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. ఇంకో ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రాజస్థాన్ రాయల్స్‌పై ఈ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి. ఇరు జట్లు తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే ఢిల్లీ 6, రాజస్థాన్ 3 మ్యాచ్‌లలో గెలిచింది.ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధిస్తుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇప్పటివరకు ఢిల్లీ బ్యాటర్ల ప్రదర్శనతోపాటు బౌలర్లు కూడా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ యూనిట్ ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ కారణంగా ఢిల్లీ విజయం సాధిస్తుందని చెప్పవచ్చు.
డీసీ
ఈ మ్యాచ్ డీసీ సొంత మైదానంలో జరగనుంది. ఇప్పటివరకు రెండు జట్ల ప్రయాణం గురించి మాట్లాడుకుంటే ఒక వైపు, ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 1 మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయి, 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, నితీష్ రాణా, వానిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార కార్తికేయ.
Read Also: Los Angels Olympics: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ వేదిక ప్రకటించిన ఐసీసీ