పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న ఊహగానాలు వెలువడుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీతో భారత రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.

భద్రతా పరిస్థితిపై కొనసాగిన చర్చలు
ఆదివారం వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠితో ప్రధాని మాట్లాడారు. ఈ ఇద్దరితో మోదీ భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని క్లిష్టమైన మార్గాల్లోని పరిస్థితిని ప్రధానికి నేవీ చీఫ్ త్రిపాఠి వివరించారు. వైమానిక దళ చీఫ్, నేవీ చీఫ్‌తో మాట్లాడిన మోదీ, తాజాగా రక్షణ కార్యదర్శితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: మోదీ
పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాదులను తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రం ఇప్పటికే ప్రతినబూనింది. ఈ క్రమంలో గత మంగళవారం జరిగిన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. దీంతో భద్రతా ఉన్నతాధికారులతో ఇప్పుడు వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Pakistan: రేంజ్ మిస్సైల్ ను ప్రయోగించిన పాకిస్థాన్