తమిళ హీరో సంతానం చేస్తున్న కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతున్నాయి. ఒకప్పుడు కమెడియన్‌గా కామెడీ చేసి సినిమాల్ని నిలబెట్టేవాడు. ఇప్పుడు హీరోగా మారి లుక్ మొత్తం మార్చేసి తన చిత్రాలతో నవ్విస్తున్నాడు. సంతానం చేసే డీడీ ఫ్రాంఛైజీ చిత్రాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. హారర్, కామెడీ జానర్లతోనే ఈ డీడీ సీక్వెల్స్‌ను సంతానం తీస్తుంటాడు. ఇక ఇప్పుడు డీడీ నెక్ట్స్ లెవెల్ అని రాబోతోంది. మే 15న ఈ చిత్రం రాబోతోంది. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.డీడీ నెక్ట్స్ లెవెల్ ట్రైలర్‌లో కామెడీ అదిరిపోయింది. పంచ్‌లు ,సెటైర్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోంది. రివ్యూలు రాసేవాళ్లని సినిమా సెట్‌లోకి పంపించి భయపెడుతున్నట్టుగా కనిపిస్తోంది. రివ్యూ రైటర్ల గురించి కౌంటర్లు వేసినట్టుగానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో సంతానం కామెడీ ఒకెత్తు అయితే చివర్లో గౌతమ్ మీనన్ ఎంట్రీ అదిరిపోయింది.
ప్రమోషన్స్
తన బ్లాక్ బస్టార్ కాకా కాకా (తెలుగులో గజినీ) చిత్రంలోని చెలియా చెలియా పాటను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చూస్తుంటే గౌతమ్ మీనన్ నెవ్వర్ బిఫోర్ అనే రోల్‌లో చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. గౌతమ్ మీనన్ ఇప్పుడు పూర్తిగా సినిమాల్లో నటించడం మీదే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా గౌతమ్ మీనన్ మాలీవుడ్‌లో రీసెంట్‌గా ఓ మూవీని తీశాడు. మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ తీసిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.మమ్ముట్టితో సినిమా తీసి కూడా జనాల్లోకి వెళ్లలేకపోయిందంటూ గౌతమ్ మీనన్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ ఇంకాస్త గట్టిగా చేసి ఉండాల్సిందని, మెగాస్టార్ మమ్ముట్టి సినిమా వచ్చిందన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయిందే అని బాధపడ్డాడు గౌతమ్. అయితే ఆ సినిమాకి కూడా అంత పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. దీంతో అది బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.
రోల్స్
ఇక గౌతమ్ మీనన్‌కి దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నటనతోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ మధ్య పవర్ ఫుల్ రోల్స్ ఏమీ కూడా పడటం లేదు. చివరగా ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ కారెక్టర్ లో మెప్పించాడన్న సంగతి తెలిసిందే.