ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగువారిలో విపరీతమైన అభిమానంతో పాటు, స్పెషల్ క్రేజ్ కూడా ఉంది. అందుకు ప్రధాన కారణం ఆయన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు కెప్టెన్‌గా పోరాడి జట్టును విజయాల బాటలో నడిపించడమే కాదు, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా తన వ్యవహారం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా తెలుగు పాటలకు డాన్స్ చేస్తూ, ఫిలిమీ డైలాగ్స్ చెప్పుతూ, టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉండగా, డేవిడ్ వార్నర్ తొలిసారిగా తెలుగు సినిమా ద్వారా వెండితెరపై మెరవబోతున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ మూవీ ద్వారా ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాకు యువ ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండటంతో పాటు, ఇందులో వార్నర్ పాత్రకు ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది.
డేవిడ్ వార్నర్ భారీ రెమ్యునరేషన్ ?
సాధారణంగా క్రికెటర్లను సినిమా రంగంలో చూడటం చాలా అరుదు. అయితే, వార్నర్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను చూసి, దర్శకుడు వెంకీ కుడుముల ‘రాబిన్ హుడ్’ చిత్రంలో అతనికి ఓ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. సమాచారం ప్రకారం, వార్నర్ పాత్ర సినిమాలో మూడు నిమిషాల పాటు మాత్రమే ఉంటుందని, కానీ ఇది సినిమా ప్రధాన హైలైట్‌గా నిలవనుందని టాక్. ఇప్పుడు అందరి దృష్టి వార్నర్‌కు ఈ సినిమాకు ఇచ్చిన పారితోషికంపై పడింది. ఒక సినిమా కోసం ఓ క్రికెటర్ తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ ఇది కావొచ్చు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, వార్నర్ ఈ సినిమాకు రూ. 2.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర తక్కువ సమయంలోనే ఉన్నప్పటికీ, భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రెండు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న వార్నర్,ప్రతి రోజుకూ దాదాపు రూ. 1.25 కోట్లు అందుకున్నారు.
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రయాణం కొనసాగుతుందా?
సాధారణంగా సెలబ్రిటీ గెస్ట్ రోల్స్ చేసిన తర్వాత వారి ప్రమోషన్‌లో పెద్దగా పాల్గొనరు. కానీ, డేవిడ్ వార్నర్ ఈ సినిమాకు కేవలం ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడమే కాకుండా, ప్రమోషన్లలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. సినిమా రీల్ లాంచ్ నుండి పబ్లిసిటీ వరకూ అన్ని కార్యక్రమాల్లోనూ ఉండబోతున్నారు. ‘రాబిన్ హుడ్’ సినిమా హిట్ అయితే, టాలీవుడ్‌లో డేవిడ్ వార్నర్‌కు మరిన్ని అవకాశాలు రావొచ్చని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు స్పెషల్ అప్పీరియన్స్‌గా ఉన్నప్పటికీ, ఈ సినిమా టీజర్, పోస్టర్ల ద్వారా ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్ మాస్ లుక్, వెంకీ కుడుముల మేకింగ్ స్టైల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా, డేవిడ్ వార్నర్ వదిలిన ‘స్పెషల్ క్లిప్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రం వార్నర్ పాత్ర ఎంత కంటే, ఆయన ప్రెజెన్స్ టాలీవుడ్‌కు ఎంత బూస్ట్ ఇస్తుందనేదే అసలు మేటర్ అని చెప్పుకుంటున్నారు.