afghanistan star cricketer

పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్

అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. కాబుల్లో జరిగిన ఆయన పెళ్లి వేడుకకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రషీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న అతని సహచర క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ పెళ్లిలో కనిపించాడు. ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, రహ్మత్ షా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లతో సహా ఇతర అఫ్గాన్ క్రికెటర్లు రషీద్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ కూడా హాజరయ్యారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించి వెడ్డింగ్ హాల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. పెళ్లి కోసం వెడ్డింగ్ హాల్​ను ఫుల్ లైటింగ్​తో గ్రాండ్​గా డిజైన్ చేశారు. ఈ క్రమంలో రషీద్​కు ఫ్యాన్స్​, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ‘వన్ అండ్ ఓన్లీ కింగ్ ఖాన్, రషీద్ ఖాన్​కు శుభాకాంక్షలు. జీవితాంతం నీకు విజయం కలగాలని కోరుకుంటున్నా’ అని సీనియర్ స్పిన్నర్ మహ్మద్ నబీ ట్విట్టర్​లో పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్పారు. కాగా, రషీద్ ఖాన్ ప్రస్తుతం ప్రపంచ నెెం.1 టీ20 బౌలర్​గా కొనసాగుతున్నాడు.

Related Posts
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, Read more

ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగం…
modhi speech

భారత ప్రధాని నరేంద్ర మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగించిన సందర్భం దేశాల మధ్య ప్రతిష్టాత్మకమైన దౌత్య సంబంధాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కావడమే కాక, అతని Read more

ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? : బండి సంజయ్
Why should farmers pay the price for government negligence? : Bandi Sanjay

హైదరాబాద్‌ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. Read more

మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి – జరీనా వహాబ్
Popular Hindi actress goes

బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని ఎక్కడా చూడలేదని.. ప్రభాస్ ఒక డార్లింగ్. ఆయనతో పని చేయడం చాలా Read more