MadhyaPradesh :ఆ గ్రామమంతా ఫుట్ బాల్ ఆటగాళ్లే.. ఎక్కడంటే!

MadhyaPradesh :ఆ గ్రామమంతా ఫుట్ బాల్ ఆటగాళ్లే.. ఎక్కడంటే!

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఏమిటో అందరికీ తెలిసిందే. కానీ, మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా విచార్‌పుర్ గ్రామం మాత్రం ఫుట్ బాల్‌ను జీవితంగా భావించే ఒక ప్రత్యేకమైన ఊరు. ఈ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మినీ బ్రెజిల్’ అని మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఫుట్ బాల్ అంటే ప్రాణంగా భావించే ఈ గ్రామం గిరిజన ప్రాబల్య ప్రాంతం అక్కడ దాదాపుగా 1,500 మంది నివసిస్తున్నారు.

Advertisements

మినీ బ్రెజిల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మన్ కీ బాత్ కార్యక్రమంలో మధ్యప్రదేశ్​లోని షాదోల్‌ జిల్లా విచార్​పుర్‌ గ్రామాన్ని ‘మినీ బ్రెజిల్’ అని అభివర్ణించారు.ఈ మినీ బ్రెజిల్ ఆటగాళ్లు బ్రెజిల్​తో కూడా ఆడటం చూడొచ్చు.సురేశ్ కుండే మాట్లాడుతూ ఓపెన్ నేషనల్స్ సాగర్​లో జరిగాయి. అక్కడ నేనే అత్యుత్తమ స్కోరర్. ఆ తర్వాత శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్​లో ఎంపికయ్యాను. కానీ ఆ సమయంలో శ్రీలంకలో సునామీ వచ్చింది. దీంతో టోర్నీ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో జరిగిన జాతీయ మ్యాచ్​లో కూడా నేను టాప్ స్కోరర్. ప్రగతి క్లబ్​లో ఉచితంగా ఫుట్ బాల్ శిక్షణ ఇస్తాం. మేము డబ్బు ఆదా చేసి ఫుట్‌ బాల్స్, ఇతర సామగ్రి కొంటాము. కొన్నిసార్లు కొంతమంది సామాజిక కార్యకర్తలు మాకు సహాయం చేస్తారు. ప్రభుత్వం సహాయం అందిస్తే మైదానాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దుతాం. అలాగే విచార్​పుర్ నుంచి మరికొంత మంది జాతీయ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దగలుగుతాం. వారు ప్రపంచస్థాయి ప్లేయర్స్​గా ఎదగొచ్చు.

ఫుట్ బాల్ నర్సరీ ఏర్పాటు

1999లో ప్రగతి ఫుట్‌ బాల్ క్లబ్​ను ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించారు.ఫుట్ బాల్​పై మక్కువతో చాలా కాలం క్రితమే సురేశ్ కుండే తన కుటుంబంతో కలిసి విచార్ పుర్​కు వచ్చేశారు. ఆ తర్వాత యువతకు ఫుట్ బాల్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మొదట చిన్న పొలంలో ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆపై గ్రామస్థుల సహకారంతో ఒక పెద్ద మైదానాన్ని నిర్మించారు. అలాగే ప్రగతి క్లబ్​ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి విచార్​పుర్ గ్రామస్థులు బాగా ఫుట్ బాల్ ఆడి జాతీయ స్థాయికి ఎంపికయ్యేవారు. ప్రగతి క్లబ్ కొలియరీ, ధన్​పురి, జబల్​పుర్, బిలాస్​పుర్, రేవా డివిజన్, ఛత్తీస్‌గఢ్​లోని అనేక ప్రాంతాలను వెళ్లి ఫుట్ బాల్ మ్యాచ్​లు ఆడి గెలుపొందారు.

images (32)

జాతీయ స్థాయిలో

నా తండ్రి ఏర్పాటు చేసిన ఈ ఫుట్‌ బాల్ క్లబ్ నేడు ఫుట్‌ బాల్ నర్సరీగా మారింది. ప్రగతి ఫుట్‌ బాల్ క్లబ్ నుంచి ఇప్పటివరకు 40-50 మంది ప్లేయర్లు జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ఆడారు. ఇంకొందరు కోచింగ్ ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆడుతున్న చాలా మంది ఫుట్ బాల్ ప్లేయర్లు విచార్​పుర్ నుంచే వచ్చారు. మా నాన్న సురేశ్ కుండే స్వయంగా ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు నేను అదే పనిచేస్తున్నా. ఎందుకంటే ఆనారోగ్య సమస్యల వల్ల మా తండ్రి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ప్రగతి క్లబ్ పూర్తి బాధ్యతలను నేను చూసుకుంటున్నాను.” అని నీలేంద్ర కుండే తెలిపారు.

ఉద్యోగం త్యాగం

తమ కుటుంబీకులు బ్రిటిష్ కాలం నుంచే ఫుట్ బాల్ ఆడుతున్నారని నీలేంద్ర కుండే వెల్లడించారు. తన తాత మురళీధర్ రైల్వేలో పనిచేశారని, ఆయన బ్రిటిష్ వారితో కలిసి ఫుట్ బాల్ ఆడేవారని తెలిపారు. “నా తండ్రి సురేశ్ కుండే తాత మురళీధర్ నుంచి ఫుట్‌ బాల్ నేర్చుకున్నారు. ఆ తర్వాత విచార్​పుర్ చేరుకుని గ్రామస్థులకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. సురేశ్ కుండే మంచి ఫుట్‌ బాల్ ప్లేయర్. ఆయన ఓపెన్ నేషనల్స్​తో సహా జాతీయ స్థాయిలో ఆడారు. మంచి అథ్లెట్ కూడా. 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పతకం కూడా గెలుచుకున్నారు. ఫుట్ బాల్ కోసం మా నాన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు. వీలైనంత ఎక్కువ మంది ప్లేయర్లను సిద్ధం చేయడానికి రైల్వే, బొగ్గు గనులు, ఎయిర్ ఇండియా, బ్యాంక్ ఉద్యోగాలను త్యాగం చేశారు. ఈ రోజు నా తండ్రి కల నిజమైంది. విచార్​పుర్‌ నుంచి ఎక్కువ మంది ఫుట్ బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. అలాగే ఈ గ్రామాన్ని అందరూ మినీ బ్రెజిల్​గా పిలుస్తున్నారు.” అని నీలేంద్ర పేర్కొన్నారు.


Related Posts
దొంగల్ని పట్టించిన గుజరాత్ పోలీస్ కుక్క
Beagle 1024x669 1

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా లో ఒక రైతు ఇంటి నుండి ₹1.07 కోట్ల విలువైన నగదు మరియు బంగారం దొంగిలించబడిన ఘటన చాలా చర్చనీయాంశమైంది. ఈ దోపిడీకి Read more

Budget 2025 : బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట..?
Budget 2025

వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 బడ్జెట్‌లో వారికి భారీ ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో Read more

డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుంది
Shri Narendra Modi Prime Minister of India

కామన్వెల్త్ ఆఫ్ డోమినికా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన అత్యున్నత జాతీయ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ గౌరవం, ప్రధానమంత్రి మోడీ COVID-19 మహమ్మారి సమయంలో Read more

India-China : భారత్-చైనా సంబంధాలపై జిన్‌పింగ్ అభిప్రాయం
భారత్-చైనా సంబంధాలపై జిన్‌పింగ్ అభిప్రాయం

India-China : భారత్-చైనా సంబంధాలపై జిన్‌పింగ్ అభిప్రాయం మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల నాయకులు పరస్పరం అభినందనలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×