हिन्दी | Epaper

CV Anand: మొహరం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సిపి సివి ఆనంద్

Sharanya
CV Anand: మొహరం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సిపి సివి ఆనంద్
  • బీబీకా ఆలంను సందర్శించిన సీపీ సివి ఆనంద్

చార్మినార్ (హైదరాబాద్): మొహరం సంతాప దినాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు (Security arrangements) చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డిజి సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. మొహరం ఎనిమిదివ రోజు సందర్భంగా శుక్రవారం ఆయన పాతబస్తీ డబీరురలోని బీబీకా ఆలంను సందర్శించి పుష్ప గుచ్చాలు, దట్టీలు సమర్పించారు. మొహరం సందర్బంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.

సీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సీపీ సివి ఆనంద్ (CV Anand) మాట్లాడుతూ మొహరం (Moharram) ప్రారంభానికి ముందే ప్రభుత్వం తరుపున మంత్రులు, షియా మత పెద్దలు, పోలీస్, ఇతర శాఖల అధికారులతో అనేక సమన్వయ సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు.మొహరం ఊరేగింపు శాంతియుత వాతావరణ లో జరిగే విధంగా 3000 వేల మందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. మొహరం ఊరేగింపును పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ట్రాఫిక్ డిసిపిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.10వ మొహరం ఊరేగింపు మార్గాలను ఆయన సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రశాంతమైన వాతావ రణలో మొహరం ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలు కూడ పోలీసులకు సహకరించి మొహరం వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని సీపీ సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సీనియర్ బిజెపి నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బాక్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870