ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా ఓటములతో ఇబ్బందులు పడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్, చివరికి గెలుపు మార్గంలోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్‌లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.బిష్ణోయ్ (2/18) రెండు వికెట్లు తీశాడు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్‌తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.సీఎస్‌కే లో తొలి మ్యాచ్ ఆడిన ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27, 6 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. రచిన్‌తో కలిసి అతడు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 52 పరుగులు జతచేశాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం చెన్నైకి ఇది రెండోసారి మాత్రమే. అయితే అవేశ్ ఖాన్ రాకతో చెన్నై వికెట్ల పతనం మొదలైంది.అతడి 5వ ఓవర్లో రషీద్ పూరన్‌కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. క్రీజులో కుదురుకున్న రచిన్ మార్క్మ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బిష్ణోయ్ రంగప్రవేశంతో సీఎస్‌కే కష్టాలు రెట్టింపయ్యాయి. బిష్ణోయ్ 13వ ఓవర్‌లో జడేజా(7) పెవిలియన్ చేరగా, ఓవర్ తేడాతో దిగ్వేశ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్(9) పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగులకే చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శివమ్ దూబే, కెప్టెన్ ధోనీ లక్నో బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ చెన్నైకి కీలక విజయాన్ని అందించారు.
ఇంపాక్ట్ ప్లేయర్
జట్టు గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైన సమయంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. కానీ, ఆ తర్వాత ధోని తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. అతను కేవలం 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ కొట్టి ఫ్యాన్స్‌కు మరపురాని గిఫ్ట్ అందించాడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్ శివం సింగ్‌తో కలిసి 27 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శివం సింగ్ 37 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది రెండో విజయం. కానీ, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడం గమనార్హం. పాయింట్ల పట్టికలో లక్నో జట్టు నాల్గవ స్థానంలో ఉంది.

బ్యాటింగ్
చెన్నై కెప్టెన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఒక క్యాచ్, ఒక స్టంపింగ్, ఒక రనౌట్ తీసుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసి వరుసగా ఐదు మ్యాచ్‌ల ఓటములకు బ్రేక్ వేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆయుష్ బదోనిని స్టంప్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. దీంతో మొదటి ఐపీఎల్ ఆటగాడిగా నిలిచాడు. దినేష్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కానీ, వీరు ధోని కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మ్యాచ్ సమయంలో, మహేంద్ర సింగ్ ధోని తన చురుకుదనంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ మొదటి బంతికే అబ్దుల్ సమద్‌ను అద్భుతంగా అవుట్ చేయడం ద్వారా అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Read Also: IPL: నేడు పంజాబ్, కోల్కతా మధ్య పోరు