పరిగణనలోకి మూడేళ్ల రికవరీ ట్రాక్
బ్యాంకు రుణాలకు రైతులు దూరం
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో వానాకాలం సాగు ప్రారంభమైంది. దుక్కులు, విత్తనాలు, ఎరువులు తదితర వాటికి పెట్టుబడులు అవసరం. ఈ నేపథ్యంలో బ్యాంకులు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పంట రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకులు కొత్త నింబధనలను తెరముందుకు తెస్తున్నాయి. సిబిఎల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (Cibil) స్కోరు ఉంటేనే పంట రుణాలు ఇస్తామని పలు బ్యాంకులు కఠినమైన నిబంధనలు అమలు చేసున్నట్లు ఆరోపణలు వెలువెతతున్నాయి.

సాధారణంగా సిబిల్ స్కోర్ కనీసం 700 నుంచి 650 పాయింట్లు
కచ్చితంగా అమలుచేస్తున్న ఈ సిబిల్ స్కోర్ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్బీఐ నిబంధన పేరుతో పంట రుణాలకు సైతం సిబిల్ స్కోర్ను బ్యాంకులు పరిగణనలోకి తీసు కుంటున్నాయి. సిబిల్ స్కోర్ కనీసం 700 నుంచి 650 పాయింట్లు ఉంటేనే రుణాలు ఇస్తున్నట్లు పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ నిబంధనతో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. రుణాల రికవరీలో మూడేళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తున్నామని, ఆ రికార్డు సరిగా ఉంటే రైతులకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా రుణాలు ఇస్తున్నామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గత రుణాల చెల్లింపుల్లో ఒకటి, రెండు నెలల వ్యత్యాసం ఉన్నా రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే చిన్న. సన్నకారు రైతులు చాలామందికి ట్రాక్ రికార్డు ఉండడం లేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రుణమాఫీ పథకం దశలవారీగా అమలు చేయడంతో పంటరుణాలు పొందిన రైతులందరికీ రుణాల మాఫీకి ఐదేళ్ల సమయం పట్టింది. అదేవిధంగా వడ్డీల భారమూ ఎక్కువైంది. దీంతో పలువురు చిన్న, సన్నకారు రైతులు వడ్డీలు చెల్లించలేక, రుణాలు రెన్యువల్ కూడా చేయించుకోలేకపోయారు. దీంతో ఫెనాల్టీలు కలుపుతూ వచ్చిన బ్యాంకర్లు ఆ రైతుల ఖాతాలను డిఫాల్టర్ కింద, నిరర్థక ఆస్తుల కింద ప్రకటించారు.
దీంతో ఇటీవల జరిగిన రుణమాఫీ పథకంలో సైతం ఈ రైతుల పేర్లను జాబితాల్లో చేర్చకపోవడంతో వారంతా రుణమాఫీ పథకానికి దూరమయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది అమలైన రుణమాఫీ పథకం సైతం విడతల వారీగా కొనసాగడంతో రైతులంతా సకాలంలో వడ్డీగానీ, అసలుగానీ చెల్లించలేదు. దీందె రుణఖాతాల రెన్యూవల్ నిలిచిపోయింది.
గత ఏడాది వరకు ఏటా రుణాలు చెల్లించిన రైతులు సైతం రుణమాఫీ జమయ్యాక బ్యాలెన్స్ ఉంజె చెల్లిద్దామనే ఆలోచనతో వేచి ఉండడంతో వారందం సిబిల్ స్కోర్ పడిపోయింది. దీంతో లక్షలాది మం॥ చిన్న, సన్నకారు రైతులు పంటరుణాలు పొందడానికి అనర్హులుగా తేలారు. మరోపక్క బంగారం తాకట్టు పెట్టి తీసుకునే వంచా రుణాలకు సైతం సిబిల్ స్కోర్ పరిగణనలో తీసుకుంటుండడంతో రైతుల్లో కలవరం మొదలైండా పంటరుణాలకు బ్యాంకర్లు సిబిల్ స్కోర్ పరిశీలించడ సరికాదని, ఈ నిబంధనను సడలిం చాల్సిందేన రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: Sigachi Plant Explosion : పేలుడు సమయంలో 700-800 డిగ్రీల టెంపరేచర్!