Criminal charges against South Korean president

దక్షిణ కొరియా అధ్యక్షుడిపై నేరాభియోగాలు

నేరారోపణలు రుజువైతే మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష..

సియోల్‌ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్‌ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష పడవచ్చు. మార్షల్‌ లా విధించిన తర్వాత యూన్‌ను పార్లమెంటు అభిశంసించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేశారు.

ఆయనను తిరిగి దేశాధ్యక్షునిగా పునరుద్ధరించాలా? లేక డిస్మిస్‌ చేయాలా? అనే అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలిస్తున్నది. మరోవైపు క్రిమినల్‌ జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగుతున్నాయి. అయితే పరిపాలనలో భాగంగానే తాను చట్టబద్ధంగా మార్షల్‌ లా విధించానని యూన్‌ తెలిపారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్‌ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నారు. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో మార్షల్‌ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకువచ్చాయి.

image

ఆ తర్వాత పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్‌ ప్రకటించారు. మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది.అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్‌ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష పడవచ్చు.

Related Posts
భారత్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ
భారత్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయంతో టోర్నమెంట్‌ నుంచి వైదొలగాడు. అతని స్థానంలో Read more

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం విడుదల
Abdus Salam Pintu

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం పింటు విడుదల అయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ విడుదలపై అటు బంగ్లాదేశ్, Read more

కులగణన కోసం స్కూల్స్ హాఫ్ డే ప్రకటించడం పై హరీష్ రావు ఫైర్
Harish Rao stakes in Anand

మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా కులగణనలో ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను మినహాయించాలని డిమాండ్ చేశారు. స్కూళ్లను కులగణన కోసం ఉపయోగించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని Read more

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం..
condoled the death of sm krishna

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్యం రిత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే Read more