ఇంజినీర్లకు నేడు షోకాజ్ ఇచ్చే అవకాశం
హైదరబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కీలకమైన మేడిగడ్డ(Medigadda) కుంగుబాటుకు బాధ్యులైన ఇంజనీర్లు, ఇతర అధికారులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారం చర్యలు తీసుకొనేందుకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీచేసేందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja) కు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. విజిలెన్స్ కమిషన్(Vigilance Commission) నివేదిక ఆధారంగా 17 మంది అధికారుల పైన, నిర్మాణ సంస్థ ఎల్అండి, పిఇఎస్ పైన క్రిమినల్ ప్రొసీడింగ్ చేపట్టనన్నట్లు తెలిసింది. క్రిమి నల్ కేసులు నమోదు చేసే అధికారులతోపాటు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న 64 మందికి కూడా షోకాజు నోటీసులు జారీచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబం ధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతో పాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పని చేసిన ఇంజినీర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఇఎన్సి నల్లా వెంకటేశ్వర్లుతో పాటు గతంలో ఎస్ఐగా పని చేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతి రావు తదితరులున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షచర్యలను చేపడుతోంది
ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కీలకపాత్ర పోషించిన గజ్వేల్ డిప్యూటీ ఇఎన్సి హరీరామ్, ఇఇ నూనెశ్రీధర్ వంటివారి ఇళ్ళపై ఎసిబి దాడులతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షచర్యలను చేపడుతోంది. మరోవైపు 2017 సెప్టెంబరు 12న సాధారణపరిపాలన శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫార్సు లపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎల్ అండి, పిఇఎస్ సంస్థల నుంచి మేడిగడ్డ 7వబ్లాకు పునరుద్ధరణకు అయ్యేవ్యయాన్ని కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని విజిలెన్స్ నివేదించింది. నిర్మాణంలో లోపం జరిగి రాఫ్ట్ కింద పైపింగ్ జరగడం, గుంత ఏర్పడటం, కుంగడం వంటి పరిణామాలు చోటుచేసుకుని ప్రాజెక్టు వైఫల్యంకు కారణమైందని నివేదించారు.
ప్రభుత్వ ఖజానాకు నష్టం
ఎల్అండ్ పిఇఎస్ అనుబంధ ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పూర్తి చేయకుండానే, పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇమ్మని కోరినందుకు నిర్మాణసంస్థ పై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో ప్రత్యేకంగా సూచించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా చూసేలా రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యు లకు సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎస్ ఎల్ఎస్సీ చైర్మన్, సభ్యులు తమ బాధ్యతను పూర్తిగా ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ పై నెట్టేస్తున్నారని విజిలెన్స్ తప్పుపట్టింది. నీటిపారుదలశాఖ కూడా నిర్లక్ష్యంగా ఏలాంటి శాఖపరమైన అవగాహన లేని ఎఇఇలను క్షేత్రస్థాయిలో నియమించి కాంట్రాక్టు సంస్థలు ఏదీ చెబితే దానికి అనుగుణంగా వ్యవహరించారని కనీసం ఎంబి బుక్స్ కూడా సరిగా నమోదు చేయలేని వైఫల్యం వారిలో కనిపించిందని తప్పు పట్టింది. కాంట్రాక్టరుకు ఆర్థికపరమైన చెల్లింపుల విషయంలో కూడా అనేక లొసుగులు ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. కాంట్రాక్టర్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు, పనికి సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి. వీటిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆర్థికశాఖను కూడా విజిలెన్స్ తప్పుపట్టింది. దీనితో ప్రభుత్వం విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని, అధికారులపై ఎఫ్ ఐఆర్ నమోదుకు ఆదేశించడం వంటి తీవ్రమైన చర్యలకు ఉపక్రమించేందుకు కసరత్తు చేస్తున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు షోకాజ్ నోటీసు లు ఇచ్చి వివరణ కోరడం అందరికీ షోకాజ్ నోటీసులివ్వడం వంటివి చేసే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ మేడి గడ్డ బ్యారేజీ కుంగడం, ఏడో బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మార్చిలో నివేదిక అందజేసింది. దీన్ని పరిశీలించిన విజిలెన్స్ కమిషన్అందులోని సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ, మార్చి 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.
బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాలు
ముఖ్యమంత్రి ఇటీవల మంత్రులతో జరిగిన సమావేశంలో విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో మళ్ళీ విజిలెన్స్ పై కదలిక వచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాలకు అవకాశం కల్పించారని గుర్తించిన కొందరు సీనియర్ ఇంజినీర్లపైన, నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారదలశాఖ మంత్రి ఉత్తమ్ రెండు రోజులక్రితం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల కు ఆదేశాలు ఇచ్చారని నీటిపారుదలశాఖ ఉద్యోగులు చర్చించుకొంటున్నారు. విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై తదు పరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు.
Read Also: School: సర్కార్ బడుల్లో ఉచితంగా సాంకేతిక విద్య