ప్రేమ పెళ్లికి అడ్డుగా నిలుస్తారని భావించిన తల్లిదండ్రులను ఓ కూతురు అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన వికారాబాద్(Vikarabad) జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. సూది మందు ఇస్తున్నానని నమ్మించిన తల్లిదండ్రులకే విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: TG Crime: తల్లి మందలించిందన్న మనస్తాపంతో.. యువతి ఆత్మహత్య

సంగారెడ్డిలో నర్సుగా పని చేస్తూ ప్రేమలో పడిన సురేఖ
మృతులు దశరథ్, లక్ష్మి దంపతులు. వీరికి ఒక కుమారుడు అశోక్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అక్కడే ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే తమ ప్రేమకు తల్లిదండ్రులు(Vikarabad) ఒప్పుకోరనే భయంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పెళ్లి చూపుల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, తల్లిదండ్రులు తన ప్రేమ పెళ్లికి అడ్డుపడతారని భావించిన సురేఖ వారిని హతమార్చేందుకు పథకం వేసింది. నిద్రలో ఉన్న తల్లిదండ్రులకు కెటామైన్ కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు దర్యాప్తులో తేలింది.
అనుమానం వ్యక్తం చేసిన అన్న – పోలీసుల విచారణలో నిజాలు
ఘటన అనంతరం ఏమి తెలియనట్లు సురేఖ తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులు సృహ తప్పి పడిపోయారని తెలిపింది. ఇంటికి వచ్చిన అశోక్ మృతుల పరిస్థితిని చూసి అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో తానే తల్లిదండ్రులను హతమార్చినట్లు సురేఖ ఒప్పుకుంది. ఆమె ఉపయోగించిన ఇంజెక్షన్లు, ఔషధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: