Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సరఫరాను వేళ్లతో సహా పెకిలించేందుకు పోలీసులు ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ను ఉధృతం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విజయవాడలో ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. పోలీసుల కార్డన్ సెర్చ్‌ను అడ్డుకునే క్రమంలో ఒక వ్యక్తి ఏకంగా తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Read Also: Bangalore Crime: సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య
తృటిలో తప్పిన ముప్పు..
బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో దుండగుడు పోలీసులు, ఈగల్ టీమ్ అధికారుల పైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అనంతరం పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మురళిగా గుర్తించారు. 9 ఎంఎం టైప్ పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: