ఈ భక్తివైరాగ్యంతో ఓ కుటుంబం దైవదర్శనం కోసం విజయవాడ (Vijayawada) కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కుటుంబం విజయవాడలోని గవర్నర్ పేటలోని ఓ హోటల్లో గతనెల 26వ తేదీన బస చేసింది. వీడియో తీసిన గుర్తు తెలియని వ్యక్తి హోటల్ Hotel గది 303 నెంబర్ గదిలో ఉదయం యువతి స్నానం చేస్తుండగా, 304 నెంబర్ గది వెంటిలేటర్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీస్తున్నాడు.
Janasena party: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి

వెంటనే చూసి యువతి అరవడంతో, కుటుంబ సభ్యులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి పారిపోయాడు. దీంతో బాధిత కుటుంబ గతనెల 29వ తేదీన గవర్నర్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి అనైతిక చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దేవుడి సన్నిధిలో ఇలాంటి పిచ్చి వేషాలెందుకు వేస్తున్నారని, దీనివల్ల పవిత్ర స్థలాలు అపవిత్రం అవుతాయని భక్తులు వాపోతున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
విజయవాడలోని గవర్నర్ పేట ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగింది.
ఏ సందర్భంలో ఆ కుటుంబం విజయవాడకు వెళ్లింది?
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: