వారణాసికి చెందిన అనన్య, విశాల్ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే అనన్య తల్లిదండ్రులు ఈ ప్రేమను అంగీకరించకుండా, ఆమెను మరో వ్యక్తికి వివాహం చేశారు. కానీ అనన్య తన భర్తను వదిలేసి విశాల్ వద్దకు వెళ్లిపోయింది. అతడే ప్రాణంగా భావిస్తూ జీవితాన్ని పంచుకున్న ఆమెకు ప్రియుడితో చిన్న గొడవ జరిగింది. విపరీతమైన కోపం పెంచుకున్న అతడు ఆమెను చంపేశాడు. ఆపై ఓ ట్రాలీ బ్యాగులో ప్యాక్ చేసి చెట్ల పొదల్లో పడేశాడు. ఆపై తన పాపం కడుక్కోవాలని భావించి గుండు కొట్టించుకుని మరీ గంగానదిలో పుణ్య స్నానం ఆచరించాడు. అంతలోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతడిని అరెస్ట్ చేశారు.
ప్రేమ
వారణాసిలోని రోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదదేవ్ తెహ్రి గ్రామానికి చెందిన అనన్య, విశాల్ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరకి విపరీతమైన ఇష్టం కాగా.. పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. కానీ ఇటీవలే వారి ప్రేమ గురించి తెలుసుకున్న అనన్య తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి చేయాలని భావించారు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఈక్రమంలోనే ప్రియుడు విశాల్‌పై ప్రేమను చంపుకోలేకపోయిన ఆమె అతడి కోసం కట్టుకున్న వాడిని వదిలేసి వచ్చింది.
చిన్న గొడవ
ఆమె జౌన్‌పూర్‌లో ఉద్యోగం చేస్తూ ఓ గదిని అద్దెకు తీసుకుంది. విశాల్ అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాడు.ఫిబ్రవరి 24న, చిన్న గొడవ మచ్లిషహర్‌లోని అనన్య ఇంటికి వెళ్లాడు. అక్కడే వారికి ఏదో చిన్న విషయంపై గొడవ జరిగింది. ఈక్రమంలోనే విపరీతమైన కోపోద్రిక్తుడైన విశాల్ వంటగదిలో దొరికిన ఓ పెనాన్ని తీసుకుని అనన్య తలపై కొట్టడం ప్రారంభించాడు. అనేక సార్లు బాదడంతో తీవ్ర రక్తస్రావమైన అనన్య ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి చెట్ల పొదల్లో పడేశాడు. పాపాన్ని కడుక్కోవాలనే ఉద్దేశంతో గంగానదిలో గుండు కొట్టించుకుని పుణ్యస్నానం చేశాడు.

ట్రాలీ బ్యాగు
ఇంట్లో ఉన్న ఓ ట్రాలీ బ్యాగు తీసి ఆమెను అందులో కుక్కాడు. ఆపై ఆ బ్యాగును ఓ రిక్షా ద్వారా తీసుకెళ్లి జౌన్‌పూర్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రి ముందున్న చెట్లపొదల్లో పడేశాడు.
గంగానది వద్దకు
పాపాన్ని కడుక్కోవాలని భావించి వారణాసిలోని తన ఇంటికి వెళ్లాడు. ముందుగా గంగానది వద్దకు వెళ్లి గుండు కొట్టించుకుని ఆపై గంగానదిలో పుణ్యస్నానం చేశాడు.
ఇంతలోపే పలువురు స్థానికులు ట్రాలీ బ్యాగులో అనన్య మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాన్ని పడేసింది విశాల్ అని గుర్తించి అతడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గంగానది వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వచ్చారు. వెంటనే నిందితుడు విశాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.